Sachin Tendulkar : ఆ ఇద్దరి బౌలింగ్ అద్భుతం – సచిన్
ప్రసిద్ కృష్ణ..ఒబెడ్ మెక్ కాయ్ కు కితాబు
Sachin Tendulkar : ఐపీఎల్ 2022లో భాగంగా అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయిర్ -2 లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలతో ఆర్సీబీ పతనాన్ని శాసించారు.
ప్రధానంగా ప్రసిద్ కృష్ణ 3 వికెట్లు తీస్తే ఒబెడ్ మెక్ కాయ్ 3 వికెట్లు తీసి సత్తా చాటారు. బౌలర్ల ప్రదర్శనతో పాటు బ్యాటింగ్ లో జోస్ బట్లర్ దంచి కొట్టడంతో రాజస్తాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది బెంగళూరుకు.
టాస్ గెలిచిన కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టారు. కేవలం 157 పరుగులకే పరిమితం చేసింది. ప్రసిద్ కృష్ణ, మెక్ కాయ్ తో పాటు ట్రెంట్ బౌల్ట్ , రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ సాధించింది.
ప్రధానంగా కృష్ణ, మెక్ కాయ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వీరిద్దరి బౌలింగ్ దెబ్బకు పరుగులు తీసేందుకు నానా తంటాలు పడ్డాడు. బరిలోకి దిగిన వెంటనే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 7 పరుగులకే ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో శాంసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అత్యంత ప్రమాదకరంగా మారిన ఫినిషర్ దినేశ్ కార్తీక్ ను 6 పరుగులకే కట్టడి చేశాడు. ఇక కార్తీక్ వెనుదిరిగాక వచ్చాక వనిందు హసరంగను అద్భుతమైన యార్కర్ తో బోల్తా కొట్టించాడు.
ప్రసిద్ 4 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే మెక్ కాయ్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి మరో 3 వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా బారత క్రికెట్ మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ రమేష్ టెండూల్కర్(Sachin Tendulkar) ఈ ఇద్దరి బౌలర్ల ను ఆకాశానికి ఎత్తేశాడు.
అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ కితాబు ఇచ్చాడు. జోస్ బట్లర్ బ్యాటింగ్ సూపర్ అని పేర్కొన్నాడు.
Also Read : మెక్ కాయ్ నిబద్దత గొప్పది – సంగక్కర