Saisha Shinde : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సైషా షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునావర్ ఫరూఖీ ప్రేమలో ఉన్న యువకుడిగా కనిపించాడంటూ కామెంట్ చేయడం కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా నెట్టింట్లో సైషా షిండే (Saisha Shinde ), మునావర్ ఫరూఖీ వైరల్ గా మారారు.
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ హోస్ట్ గా కొన్ని రోజులుగా రియాల్టీ షో లాక్ అప్ పేరుతో చేస్తోంది. ఈ షో మోస్ట్ పాపులర్ గా నిలిచింది. ఈ సందర్భంగా సైషా షిండే మునావర్ పై ఈ కామెంట్స్ చేయడం ఆసక్తిని రేపింది.
ప్రేమికుడిలా తనకు కనిపిస్తున్నాడంటూ పేర్కొంది షిండే. అంతే కాదు అతడి పట్ల తనకు ఉన్న ఆకర్షణ గురించి వ్యక్తం చేసింది. ఇదే సమయంలో హోస్ట్ రనౌత్ తో సైషా షిండే వాదనలకు దిగింది.
ఆమె లాక్ అప్ రియాల్టీ షో నుంచి తొలగించ బడ్డారు. షోకు సంబంధించి పాపులర్ కంటెస్టెంట్స్ లో సైషా కూడా ఒకరు గా ఉన్నారు. లాక్ అప్ జైలులో ఉన్న సమయంలో సైషా తన తోటి కంటెస్టెంట్ ..హాస్య నటుడు మునావర్ ఫరూఖీఈ పట్ల తనకు ఉన్న లవ్ గురించి బహిరంగంగా చెప్పింది.
బయటకు వచ్చాక తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. మునావర్ వైపు తనను ఆకర్షించిన అంశం ఏమిటో కూడా చెప్పేసింది. ఇదే సమయంలో అంజలి అరోరా పట్ల అసూయ కలిగిందని పేర్కొంది.
ఆమె మునావర్ ఫరూఖీ చేయి పట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. కేవలం అతడి పట్ల కలిగిన ప్రేమ తప్ప మరొకటి కాదంది.
Also Read : హిజ్రాలతో మమేకమైన ఇషా కొప్పికర్