Journalist Kommineni Srinivas : సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్
అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు అక్కడికి తరలించారు...
Kommineni Srinivas : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో ఉన్న కేఎస్ఆర్(Kommineni Srinivas) నివాసానికి విజయవాడ పోలీసులు సోమవారం వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు అక్కడికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకెళ్లారు.
Sakshi Journalist Kommineni Srinivas Arrested
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కొమ్మినేనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.
ఒక టీవీ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U) SC, ST POA చట్టంలోని సెక్షన్లను వర్తింపజేశారు.
Also Read : Prabhakar Rao-SIT Investigation : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ను విచారిస్తున్న సిట్
