Salman Butt Pant : పంత్ ఫిట్ నెస్ సల్మాన్ భట్ కామెంట్స్
అధిక బరువు వల్ల ఆడలేక పోతున్నాడు
Salman Butt Pant : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే అటు టి20, ఇటు వన్డేల్లో పేలవమైన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న రిషబ్ పంత్ పై(Salman Butt Pant) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఫిట్ నెస్ ఆందోళన కలిగిస్తోందన్నాడు. ఈ అధిక బరువు కారణంగా సరిగా ఆడలేక పోతున్నాడని, ప్రధానంగా ఆటపై ఫోకస్ పెట్టడం లేదని పేర్కొన్నాడు.
ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో చోటు దక్కడం కష్టమన్నాడు. బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో 46 పరుగులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. గత కొంత కాలంగా జట్టులో ఆడక పోయినా చోటు దక్కడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ తరుణంలో తను ఆడేందుకు, క్రీజులో పాతుకు పోయేందుకు నానా తంటాలు పడుతున్నాడు. పంత్ పూర్తిగా పట్టు కోల్పోతున్నాడని అసలు బంతుల్ని ఎదుర్కోవడం చేత కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ భట్. తన స్వంత యూట్యూబ్ ఛానల్ లో ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నా కేరళ స్టార్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడం, పంత్ ను పదే పదే కొనసాగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పంత్ తనకు నచ్చిన విధంగా ఆడుతున్నాడు. కానీ వినూత్నంగా ఔట్ అయ్యాడు. స్టంప్ లను కొట్టే ముందు బంతి బ్యాట్ , ప్యాడ్ కు తగలడంతో విచిత్రంగా వెనుదిరిగాడని పేర్కొన్నాడు సల్మాన్ భట్.
Also Read : మొదటి టెస్టులో పట్టు బిగించిన భారత్