Monica Khanna : 191 మందిని కాపాడిన మోనికా ఖ‌న్నాకు స‌లాం

స్పైస్ జెట్ పైల‌ట్ కు దేశమంత‌లా ప్ర‌శంస‌లు

Monica Khanna : ఎవ‌రీ మోనికా ఖ‌న్నా అనుకుంటున్నారా. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంస‌లు అందుకుంటోంది. ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం ఆమె చేసింది. ఢిల్లీ నుంచి 191 మంది ప్ర‌యాణికుల‌తో బ‌య‌లు దేరింది స్పైస్ జెట్ విమానం.

మోనికా ఖ‌న్నా పైల‌ట్ గా ఉన్నారు ఆ స‌మ‌యంలో. టేకాఫ్ చేశాక రెక్క‌ల కింద నుంచి పెద్ద ఎత్తున మంట‌లు వ్యాపించాయి. దీనిని కొంద‌రు వ్య‌క్తులు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇదే స‌మ‌యంలో ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ రూం నుంచి ఆదేశాలు వెళ్లాయి. వెంట‌నే స‌మీపంలో ఉన్న ఏ ఎయిర్ పోర్ట్ లోనైనా దించేయాలంటూ. ఆ స‌మ‌యంలో ఫైట్ లో ప్ర‌యాణిస్తున్న 191 మంది తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

హాహాకారాలు చేశారు. కానీ వారంద‌రికీ భ‌రోసా ఇస్తూ , ధైర్యం నింపుతూ అత్యంత ధైర్య సాహసాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ..చాక చ‌క్యంతో విమానాన్ని సుర‌క్షితంగా బీహార్ లోని పాట్నా ఎయిర్ పోర్ట్ లో దిగేలా చేసింది.

దీంతో ఫ్లైట్ లో ప్ర‌యాణిస్తున్న ఏ ఒక్క‌రు గాయ‌ప‌డ‌లేదు. ఇదంతా పైల‌ట్ మోనికా ఖ‌న్నా(Monica Khanna)  చ‌ల‌వేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీంతో ఇవాళ సోష‌ల్ మీడియాలోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ పైలట్ ప్ర‌ద‌ర్శించిన ధైర్య సాహ‌సాల‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ ఇలాంటి సాహ‌సానికి ఎవ‌రూ ప్ర‌య‌త్నం చేయ‌రు.

కానీ ఒక మ‌హిళ అయి ఉండి ఎలాంటి తొట్రు పాటుకు, ఒత్తిళ్ల‌కు లోనుకాకుండా ప్రయాణికుల్ని కాపాడిన ధైర్యానికి ప్ర‌తి ఒక్క‌రు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇలాంటి వాళ్లే క‌దా దేశానికి కావాల్సింది.

Also Read : ఆస్ప‌త్రి నుంచి ‘సోనియా’ డిశ్చార్జి

Leave A Reply

Your Email Id will not be published!