Samantha Akshay Dance : సమంత అక్షయ్ డ్యాన్స్ అదుర్స్
ఊ అంటావా మావా పాట జోష్
Samantha Akshay Dance : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సమంత నటించిన పుష్ప మూవీలోని ఊ అంటావా సాంగ్ ఇప్పటికీ రికార్డుల మోత మోగిస్తోంది. చంద్ర బోస్ రాసిన ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించి మ్యాజిక్ చేశాడు.
కోట్లాది మంది ఈ పాటను ప్రేమించారు. ఇంకా ఈ పాటతో జల్సా చేస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఏకంగా సమంత రూత్ ప్రభుతో(Samantha Akshay Dance) కలిసి ఈ సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.
ప్రస్తుతం నెట్టింట్లో వీరిద్దరి ఫోటోలు, సాంగ్ వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా వీరిద్దరూ కలిసి డిస్నీ హాట్ స్టార్ కోసం ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ చేస్తున్న ప్రోగ్రాం ఇద్దరూ సూపర్ స్టార్ లతో కూడిన కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ కోసం ఇలా చేశారు.
ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇది 7వ ఎపి సోడ్ . డిస్నీ + మాట్ స్టార్ అధికారిక ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ పోస్ట్ చేసిన కొత్త వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇంట్లో ఉష్ణో గ్రతను పెంచే కూల్ అండ్ ది కిల్లర్ జూలై 21న ప్రసారం కానుందంటూ క్యాప్షన్ పేర్కొంది. కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ – ట్రైలర్ విడుదలైంది.
ఇది కూడా బిగ్గెస్ట్ ట్రెండ్ గా నిలిచింది. విడుదలైన కొద్ది సేపటికే వ్యూయర్స్ పెరిగారు. అసంతృప్తికరమైన వివాహాలకు కారణం మీరే. మీరు జీవితాన్ని కే3జీ ( కభీ ఖుషీ కభీ ఘమ్ ) గా చిత్రీకరించారు. వాస్తవానికి కేజీఎఫ్ కేజీఎఫే అంటూ క్యాప్షన్ ఇప్పుడు ఆకట్టుకుంటోంది.
Also Read : ‘సెలయేరు పారుతుంటే’ సెన్సేషన్