Samantha Dhawan : మ‌రో వెబ్ సీరీస్ కు సమంత రెడీ 

నెట్టింట్లో వ‌రుణ్ ధావ‌న్ సామ్ వైర‌ల్ 

Samantha Dhawan : టాలీవుడ్ , కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో సైతం హ‌ల్ చ‌ల్ చేస్తోంది న‌టి స‌మంత‌. అక్కినేని నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చాక అటు సినిమాల్లో, వెబ్ సీరీస్ ల‌లో ఫుల్ బిజీగా మారింది.

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ల‌వ్లీ బ్యూటీ ర‌ష్మిక మందాన‌తో క‌లిసి న‌టించిన పుష్ప రాజ్ మూవీలో స‌మంత స్పెష‌ల్ సాంగ్ తో దుమ్ము రేపింది.

ఈ ఒక్క పాట మిలియ‌న్ వ్యూస్ తో వ‌ర‌ల్డ్ వైడ్ గా టాప్ లో నిలిచింది. కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చింది. దీంతో స‌మంత మ‌రోసారి ఇండియాలో మ‌రింత పాపుల‌ర్ గా మారింది.

ప్ర‌తి రోజూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫోటోలు, కామెంట్స్ షేర్ చేస్తూ దుమ్ము రేపుతోంది. తాజాగా ముంబైలో ప్ర‌ముఖ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి స‌మంత హ‌ల్ చ‌ల్ చేసింది.

వీరిద్ద‌రూ క‌ల‌వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్ లో. వీరిద్ద‌రూ క‌లిసి తొలిసారిగా వెబ్ సీరీస్ లో న‌టించ‌నుంది. ప్ర‌ముఖ హాలీవుడ్ సీరీస్ సిట‌డెల్ కు ఇండియ‌న్ వెర్ష‌న్ లో ఓ సీరీస్ ను నిర్మించ‌నున్నారు.

బాలీవుడ్ లో ఈ వెబ్ సీరీస్ ఇది ప్రారంభం కానుంది. ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ లో ఇదివ‌ర‌కే న‌టించి మెప్పించిన సామ్(Samantha ) ఇప్పుడు ఇదే సీరీస్ ద‌ర్శ‌కుల సార‌థ్యంలో సిట‌డెల్ ను నిర్మించ‌నున్నారు.

సిట‌డెల్ వెబ్ సీరీస్ లో ధావ‌న్ , స‌మంత క‌లిసి న‌టించ‌నుండ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Also Read : ఎన్టీఆర్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సొనాలి బింద్రే

Leave A Reply

Your Email Id will not be published!