Samantha Ruth Prabhu : ఐఎఫ్ఎఫ్ కు ముఖ్య అతిథిగా స‌మంత

మెల్ బోర్న్ కు రావాలంటూ ఆహ్వానం

Samantha Ruth Prabhu : న‌టిగా ఫుల్ మార్కులు కొట్టేసిన స‌మంత ఐటం సాంగ్స్ తో దుమ్ము రేపుతోంది. భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుని ముందుకు సాగుతోంది. తాజాగా ఆమెకు అరుదైన గౌర‌వం ల‌భించింది.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జ‌రిగే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన భార‌తీయ చ‌ల‌న చిత్ర పండుగ (ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ) కి రావాలంటూ ఫెస్టివ‌ల్ నిర్వాహ‌కులు ఆహ్వానం పంపారు. గ‌తంలో ప్ర‌తి ఏటా ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

అయితే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రెండేళ్ల నుంచి ఫిలిం ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించ‌డం లేదు. ఈ ఏడాది 2022 లో క‌రోనా కాస్తా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తిరిగి ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ను గ్రాండ్ గా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ వేడుక‌లు వ‌చ్చే నెల ఆగ‌స్టు 12 నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా త‌న‌కు ర‌మ్మంటూ ఆహ్వానించ‌డంతో ముద్దుగుమ్మ స‌మంత తెగ సంబ‌ర ప‌డి పోతోంది.

గ‌త ఏడాది ఐఎఫ్ఎఫ్ఎంలో తాను భాగ‌మ‌య్యాన‌ని, ప్ర‌స్తుతం భార‌తీయ సినిమా పండుగ‌లో భాగం పంచుకోవ‌డం మ‌రింత సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని పేర్కొంది న‌టి స‌మంత(Samantha Ruth Prabhu).

భార‌త దేశానికి సంబంధించిన అన్ని ప్రాంతాల‌కు చెందిన సినిమాలు, సినీ రంగానికి న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, ప్ర‌తిభ క‌లిగిన క‌ళాకారులు, టెక్నీషియ‌న్స్ ను ఈ సంద‌ర్భంగా క‌లుసుకునేందుకు వారితో ఆలోచ‌న‌ల్ని పంచుకునేందుకు ఇది వేదిక‌గా ఉప‌యోగ ప‌డుతుంద‌ని అభిప్రాయ ప‌డింది స‌మంత‌.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే నాగ చైత‌న్యతో విడి పోయాక స‌మంత‌కు పెద్ద ఎత్తున ఆఫ‌ర్లు రావ‌డం ఆశ్చ‌ర్య పోయేలా చేసింది.

Also Read : లైగ‌ర్ ట్రైల‌ర్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!