Samantha : పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిన నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె తాను వాడిన దుస్తులపై కొందరు కామెంట్స్ చేయడంపై ప్రత్యేకంగా స్పందించారు.
మీరు వ్యక్తుల దుస్తులు, అలంకరణపై దృష్టి పెట్టే బదులు మిమ్మల్ని మీరు ప్రేమించుకునేందుకు, మిమ్మల్ని మీరు బాగు పడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే బెటర్ అని సూచించింది.
ఎవరికి తోచినట్టు వారు ఉండడం అనేది సౌకర్యం. ఎదుటి వాళ్లను గాయపర్చడం కంటే మీరు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసుకోవాలని సూచించింది. వ్యాఖ్యలు చేయడం, అభిప్రాయాలు చెప్పడం చాలా సులభం.
కానీ ఒక్కో మెట్టు జీవితంలో ఎక్కుతూ వచ్చిన వాళ్లకు వాటిని లైట్ గా తీసుకుంటారని స్పష్టం చేసింది. తాను వీటిని పట్టించుకోనని పేర్కొంది. మన వ్యక్తిత్వమే మన అందమని కుండ బద్దలు కొట్టింది సమంత(Samantha).
ధరించిన దుస్తులపై లేనిపోని కామెంట్స్ చేయడం వల్ల కాలం వృధా అవుతుందే తప్పా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని వెల్లడించింది.
ఇదే విషయాన్ని తన అధికారిక సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్ నెట్టింట్లో హల్ చల్ గా మారింది.
తన అందం, వేష ధారణ తన ఇష్టమని ఇంకొకరికి కామెంట్ చేసే అర్హత లేదని తెలిపింది సమంత. మహిళలను వారి శరీర ఆకృతిని, అందాలను ప్రాతిపదికగా చేసుకుని వ్యాఖ్యానించడం మానుకోవాలని హితవు పలికింది సమంత రుత్ ప్రభు.
Also Read : ప్రభాస్తో కామెడీ చేయించబోతున్న మారుతి?