Samatha Kumbh 2023 : దివ్య సాకేతంలో కళ్యాణోత్సవం
చిన్న జీయర్ పర్యవేక్షణలో పుష్పార్చన
Samatha Kumbh 2023 : శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సాకేత్ కుంభ్ 2023(Samatha Kumbh 2023) ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి స్వామి వారి భక్తులు తరలి వచ్చారు ఉత్సవాలలో పాల్గొనేందుకు. నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈనెల 14 వరకు సాకేత్ కుంభ్ ఉత్సవాలు జరగనున్నాయి.
మంగళవారం పుణ్య క్షేత్రంలో స్వామి వారి ఆధ్వర్యంలో డోలోత్సవం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిగింది. అనంతరం తీర్థ గోష్టి, ప్రసాద వితరణ జరిగింది. ఇక సాకేత్ కుంభ్ ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 8న బుధవారం ఉదయం 11.30 గంటలకు కళ్యాణోత్సవంతో పాటు సామూహిక పుష్పార్చన జరగనుంది.
మధ్యాహ్నం 1.30 గంటల నుండి 4.30 గంటల వరకు భగవద్గీతలో సూపర్ మెమోరీ టెస్టు నిర్వహిస్తారు. అమెరికాతో పాటు దేశానికి చెందిన విద్యార్థులు పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఇక 9న గురువారం ఉదయం 108 దివ్య దేశాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5.00 నుంచి 5.45 శ్రీ విష్ణు సహస్ర పారాయణం నిరర్వహిస్తారు. 5 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమం ఉంటుంది. 6.00 నుంచి రాత్రి 8.30 గంటలకు గరుడ సేవలు ఉంటాయి. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది.
10న శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటలకు గజ వాహన సేవ, 18 గరుడ సేవలు నిర్వహిస్తారు. 11న శనివారం ఉదయం 9 గంటలకు రథోత్సవం , నిత్య పూర్ణ హారతి , చక్ర స్నానం ఉంటుంది. మధ్యాహ్నం విశ్వ శాంతి కోసం గీతా పారాయణం చేపడతారు.
Also Read : భక్త బాంధవుడు నారాయణుడు