Samatha Kumbh 2023 : సమతా కుంభ్ ఉత్సవాలు ప్రారంభం
చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
Samatha Kumbh 2023 : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో కొలువైన సమతా మూర్తి స్పూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2 గురువారం సమతా కుంభ్ 2023 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రాంరభం అయ్యాయి.
ఈనె 2 నుంచి 14 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సువర్ణ మూర్తి భగవద్ రామానుజులకు పూజలు చేశారు.
పెద్ద ఎత్తున దేశ, విదేశాల నుంచి సమతా కుంభ్ (Samatha Kumbh 2023) బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు విష్వక్సేన వీధి శోధన జరుగుతుంది. అనంతరం 1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్టి, సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విష్ణు సహస్ర నామ స్త్రోత్ర పారాయణం కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల దాకా అంకురార్పణ వైనతేయ ప్రతిష్ట తీర్థ ప్రసాద గోష్టి నిర్వహిస్తారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు సూర్య ప్రభ వాహన సేవ కొనసాగుతుంది. 6 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 దాకా దివ్య సాకేతంలోని యాగశాలలో ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రం 5.00 నుంంచి 5.45 గంటల దాకా శ్రీ విష్ణు సహస్ర పారాయణం, 6.00 నుంచి 6.30 దాకా వేదికపై అంకురారోహణ ఉంటుంది. 6.30 నుంచి 8.30 దాకా చంద్రప్రభ వాహన సేవ కొనసాగుతుంది. అనంతరం తీర్థ, ప్రసాద వితరణ జరుగుతుంది.
ఇప్పటికే తరలి వస్తున్న భక్తులకు సాదర స్వాగతం పలుకుతోంది జీవా కుటుంబం.
Also Read : 11 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు