Samata Kumbh : దివ్య సాకేతంలో సమతా కుంభ్ ఉత్సవాలు
చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
Samata Kumbh : జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్ లోని దివ్య సాకేతంలో ఫిబ్రవరి 2 బుధవారం నుండి సమతా కుంభ్(Samata Kumbh) పేరుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశ, విదేశాల నుంచి భక్త జన బాంధవులు భారీగా తరలి రానున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12 వరకు సమతా కుంభ్ ఉత్సవాలు కొనసాగుతాయి.
- 2న గురువారం ఉదయం దివ్య సాకేతంలో పూజలతో ప్రారంభం అవుతుంది. 11 నుంచి 1 గంట దాకా దిష్వక్సేన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్థ, ప్రసాద వితరణ , సాయంత్రం 5 నుంచి 5.45 గంటలకు శ్రీ విష్ణు సహస్ర పారాయణం, విశిష్టత ఉంటుంది. 6.00 నుంచి 6.30 దాకా అంకురారోహణ వైనతేయ ప్రతిష్ట , రాత్రి 8.30 గంటలకు తీర్థ, ప్రసాద వితరణ జరుగుతుంది.
- 3న శుక్రవారం ఉదయం 7 గంటలకు సూర్య ప్రభ వాహన సేవ కొనసాగుతుంది. 6 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 దాకా దివ్య సాకేతంలోని యాగశాలలో ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రం 5.00 నుంంచి 5.45 గంటల దాకా శ్రీ విష్ణు సహస్ర పారాయణం, 6.00 నుంచి 6.30 దాకా వేదికపై అంకురారోహణ ఉంటుంది. 6.30 నుంచి 8.30 దాకా చంద్రప్రభ వాహన సేవ కొనసాగుతుంది. అనంతరం తీర్థ, ప్రసాద వితరణ జరుగుతుంది.
- 4న శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల దాకా సామూహిక పారాయణం. 1.30 నుంచి 4.00 గంటల దాకా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6.00 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శేష వాహన సేవ, హంస వాహన సేవ, 18 గరుడ సేవలు కొనసాగుతాయి. అనంతరం తీర్థ, ప్రసాదం అందజేస్తారు.
- 5న ఆదివారం 108 రూపాలలో శాంతి కళ్యాణ మహోత్సవం ప్రధాన వేదికపై నిర్వహిస్తారు.
- 6న సోమవారం ఉదయం 11. 30 గంటలకు వసంతోత్సవం. సాయంత్రం 6. 00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు గరుడ సేవ ఉంటుంది.
- 7న మంగళవారం ఉదయం 11.30 గంటలకు డోలోత్సవం. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవతో పాటు 18 గరుడ సేవలు జరుగుతాయి.
- 8న బుధవారం ఉదయం 11.30 గంటలకు కళ్యాణోత్సవంతో పాటు సామూహిక పుష్పార్చన. మధ్యాహ్నం 1.30 గంటల నుండి 4.30 గంటల వరకు భగవద్గీతలో సూపర్ మెమోరీ టెస్టు నిర్వహిస్తారు. అమెరికాతో పాటు దేశానికి చెందిన విద్యార్థులు పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు.
- 9న గురువారం ఉదయం 108 దివ్య దేశాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5.00 నుంచి 5.45 శ్రీ విష్ణు సహస్ర పారాయణం నిరర్వహిస్తారు. 5 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమం ఉంటుంది. 6.00 నుంచి రాత్రి 8.30 గంటలకు గరుడ సేవలు ఉంటాయి. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది.
- 10న శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమం ఉంటుంది.
సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటలకు గజ వాహన సేవ, 18 గరుడ సేవలు నిర్వహిస్తారు. - 11న శనివరం ఉదయం 9 గంటలకు రథోత్సవం , నిత్య పూర్ణ హారతి , చక్ర స్నానం ఉంటుంది. మధ్యాహ్నం విశ్వ శాంతి కోసం గీతా పారాయణం చేపడతారు.
- 12న ఆదివారం ఉదయం 9 గంటలకు సాంకేత రామచంద్ర ప్రభువుకు దివ్య సాకేతంలో పూజలు ఉంటాయి. మధ్యాహ్నం 3.00 గంటలకు పుష్ప యాగం , దేవతా ధ్యానవనం , మహా పూర్ణ హారతి, ధ్వజారోహణం ఉంటుంది. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది.
భక్త బాంధవులకు దివ్య సాకేత క్షేత్రంలో జరిగే సాకేత కుంభ(Samata Kumbh) ఉత్సవాలలో కైంకర్యాలు నిర్వహించే భాగ్యాన్ని జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు కల్పించారు.
ఒక రోజు యాగశాలలో కైంకర్యం , 9 రోజుల పాటు కైంకర్యం సౌకర్యం ఉంటుంది. దివ్య దేశమూర్తులు, రుత్వికులకు వస్త్రాలు సమర్పించే అవకాశం, వాహన సేవ, పుష్ప కైంకర్యం, గోదానం, గోసేవ ఉంటుంది.
Also Read : 11 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు