Samsung Apology : దెబ్బ‌కు దిగొచ్చిన శాంసంగ్

ప్ర‌వ‌క్త వివాదానికి క్ష‌మాప‌ణ

Samsung Apology : టెక్ దిగ్గ‌జం శాంసంగ్ ఎట్ట‌కేల‌కు దిగొచ్చింది. ప్ర‌వ‌క్తపై వివాదం చెల‌రేగ‌డంతో పాకిస్తాన్ లో అల్ల‌ర్లు పెద్ద ఎత్తున చెల‌రేగాయి. చివ‌ర‌కు ఈ ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మార‌డంతో కంపెనీ దిగొచ్చింది.

ఇస్లాం మ‌తాన్ని, మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను కించ ప‌రిచింద‌న్న ఆరోప‌ణ‌లతో ఉద్రిక్తంగా మారింది. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో పాకిస్తాన్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

ఈ మేర‌కు అధికారికంగా శాంసంగ్ కంపెనీ(Samsung Apology) ఓ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. దైవ దూష‌ణ‌కు పాల్ప‌డిందంటూ స‌ద‌రు కంపెనీపై పాకిస్తాన్ ప్ర‌జ‌లు నిప్పులు చెరిగారు.

దీనికి సంబంధించి అంత‌ర్గ‌త ద‌ర్యాప్తు న‌కు ఆదేశించిన‌ట్లు సంస్థ స్ప‌ష్టం చేసింది. ఏ మ‌తాన్ని కించ ప‌ర్చ‌డం త‌మ అభిమ‌తం కాద‌ని పేర్కొంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం పాకిస్తాన్ లోని క‌రాచీలో స్టార్ సిటీ మాల్ లో ఓ వైఫై డివైజ్ ను ఇన్ స్టాల్ చేసింది. ఈ డివైజ్ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మైంది.

విష‌యం తెలుసుకున్న వెంట‌నే భారీ ఎత్తున మాల్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. తీవ్ర నిర‌స‌న‌కు దిగారు. శాంసంగ్ కంపెనీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఈ డివైజ్ కు సంబంధించి త‌యారు చేసిన క్యూ ఆర్ కోడ్ ప్ర‌వ‌క్త‌ను కించ ప‌రిచేదిగా ఉందంటూ గొడ‌వ‌కు దిగారు శాంసంగ్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

మాల్ ను విధ్వంసం సృష్టించారు. ప‌లువురికి గాయాలు కూడా అయ్యాయి. ప‌రిస్థితిని అదుపులోకి తీసుకు వ‌చ్చేందుకు పోలీసులు ఎంట‌ర్ కావాల్సి వ‌చ్చింది. 27 మంది శాంసంగ్ ఉద్యోగుల‌ను అదుపులోకి తీసుకుంది.

Also Read : జూన్ లో భారీగా పెరిగిన జీఎస్టీ ఆదాయం

Leave A Reply

Your Email Id will not be published!