Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించారు. తన టెస్టు కెరీర్ లో దిగ్గజ ఆటగాళ్లు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, భారత్ కు చెందిన సచిన్ టెండూల్కర్ లు సాధించిన పరుగులను అధిగమించాడు స్మిత్.
పాకిస్తాన్ తో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులు చేశాడు. దీంతో గతంలో సంగక్కర, సచిన్ చేసిన రన్స్ ను అధిగమించాడు స్టీవ్ స్మిత్(Steve Smith ). 150 ఇన్నింగ్స్ ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు స్మిత్.
ప్రస్తుతం పాక్ లో జరుగుతున్న టూర్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. రావల్పిండి, కరాచీలలో జరిగిన మొదటి, రెండో టెస్టులో వరుసగా 78, 72 పరుగులు చేశాడు.
ఇవాళ లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియంలో జరుగుతున్న మూడోది, చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో స్మిత్(Steve Smith )హాఫ్ సెంచరీని దాటాడు. ఈ సీరీస్ లో ఇప్పటి వరకు సెంచరీ సాధించక పోయినా 59 రన్స్ తో భారీ రికార్డును నమోదు చేశాడు.
తన కెరీర్ లో టెస్టుల్లో ఇప్పటి వరకు 7 వేల 993 పరుగులు చేశాడు. అంతకు ముందు 150 ఇన్నింగ్స్ లలో శ్రీలంక మాజీ స్కిప్పర్ కుమార సంగక్కర చేసిన 7 వేల 913 రన్స్ ను అధిగమించాడు.
ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న సచిన్ చేసి 7 వేల 869 రన్స్ , వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 7 వేల 694, ద్రవిడ్ చేసిన 7 వేల 680 లను దాటాడు స్టీవ్ స్మిత్.
ఇదిలా ఉండగా మూడో వికెట్ కు స్మిత్ , ఉస్మాన్ తో కలిసి 138 పరుగులు జత చేశాడు.
Also Read : భారత్ భళా బంగ్లాదేశ్ విల విల