Sanjay Banger : ఈ ఏడాది ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ జరగనుంది. దీంతో భారత జట్టు ప్రయోగాలు చేసేందుకు రెడీ అయ్యింది. ఇదే సమయంలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ కూడా జరగనుంది.
ఇప్పటికే మెగా వేలం పాట పూర్తయింది. దీంతో ఐపీఎల్ లో కూడా సత్తా చాటే ఆటగాళ్లకు ఛాన్స్ దొరకనుంది. ఇదే విషయాన్ని జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ , కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు.
సెలక్షన్ కమిటీ ఎంపిక తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వృద్దిమాన్ సాహా సంచలన ఆరోపణలు చేశాడు. ఇదే రచ్చకు దారి తీసింది. తాను బాగా ఆడినా ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు.
అంతే కాదు తనను రిటైర్మెంట్ గురించి ఆలోచించమని రాహుల్ ద్రవిడ్ అన్నాడంటూ బాంబు పేల్చాడు. ఇప్పటికే సవాలక్ష అనుమానాలు, ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది బీసీసీఐ.
ఓ వైపు దాదా ఇంకో వైపు జే షా . క్రీడలు , రాజకీయాలు కలిస్తే ఇలాగే ఉంటాయి. దేశంలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక అతడి స్థానంలో ఎవరిని ఆడించాలనే దానిపై జట్టు తర్జన భర్జనలు పడుతోంది.
ఈ తరుణంలో భారత జట్టు మాజీ కోచ్ సంజయ్ బంగర్(Sanjay Banger )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్లేస్ లో ఆడే సత్తా ఉన్నోడు శ్రేయాస్ అయ్యర్ ఒక్కడేనంటూ పేర్కొన్నాడు.
Also Read : తలవంచిన శ్రీలంక చెలరేగిన భారత్