Sanjay Dutt Vijay : లియో కోసం వెయిటింగ్ – సంజయ్ దత్
తళపతి విజయ్ కి విజయం దక్కాలి
Sanjay Dutt Vijay : ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ప్రముఖ నటుడు తళపతి విజయ్ పుట్టిన రోజు. ఆయనకు 49 ఏళ్లు. ఇప్పటి వరకు తన కెరీర్ లో 61 సినిమాలు చేశాడు. బాల నటుడిగా ప్రవేశించిన ఆయన 1992 నుంచి హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తమిళ సినీ రంగంలో మినిమం గ్యారెంటీ ఉన్న నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా యాక్టర్ సంజయ్ దత్(Sanjay Dutt) విజయ్ ని ఆకాశానికి ఎత్తేశాడు. సోదరా నీతో కలిసి పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని, అంతకు మించిన ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. జీవిత కాలంలో ఆనందం కలగాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరాడు. మీ సున్నిత హృదయం, సాటి మనుషుల పట్ల కరుణ, ప్రేమ తనను ఎంతగానో ఆకట్టుకునేలా చేసిందన్నాడు సంజయ్ దత్.
ప్రస్తుతం లక్షలాది మంది నా, నీ అభిమానులు లియో చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని అందులో తాను కూడా ఒకడినంటూ స్పష్టం చేశారు బాలీవుడ్ నటుడు. లియో చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవాలని, రికార్డులను తిరగ రాయాలని కోరాడు సంజయ్ దత్. ఇదిలా ఉండగా ప్రస్తుతం సంజయ్ దత్ విజయ్ తో కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారింది. నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Also Read : Karthik Palani Vijay : తళపతికి కార్తీక్ పళని విషెస్