Sanjay Raut : మార్గరెట్ అల్వాకు శివసేన మద్ధతు – రౌత్
ప్రకటించిన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
Sanjay Raut : మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం ఇంకా వేడిగానే ఉంది ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నా. ఓ వైపు శివసేన ఇంకో వైపు తిరుగుబాటు నేత, సీఎం ఏక్ నాథ్ షిండే, భారతీయ జనతా పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
మరో వైపు మహా వికాస్ అఘాడీ ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో సంచలన కామెంట్స్ చేశారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut). ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ప్రకటించిన ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రిగా పని చేసిన మార్గెరెట్ అల్వాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా మొన్నటి దాకా నువ్వా నేనా అన్న రీతిలో కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలను ఏకి పారేస్తూ వచ్చిన శివసేన పార్టీ ఉన్నట్టుండి రూటు మార్చింది.
శివసేన పార్టీలకు చెందిన 19 మంది ఎంపీలలో అత్యధిక శాతం ఎంపీలు మూకుమ్మడిగా బీజేపీ బలపర్చిన ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని పట్టుబట్టారు.
ఈ తరుణంలో తప్పని సరి పరిస్థితుల్లో ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తాము విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాకుండా ద్రౌపది వైపు మొగ్గు చూపింది.
ఈ తరుణంలో సంజయ్ రౌత్(Sanjay Raut) చేసిన ప్రకటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందు మద్దతు ఇస్తామంటారు ఆ తర్వాత తప్పుకుంటారంటూ కొందరు విమర్శిస్తున్నారు.
Also Read : గవర్నర్ పదవిపై వెంకయ్య కామెంట్స్