Sanjay Raut Modi : సరిహద్దు వివాదం మోదీ మౌనం – రౌత్
ఉక్రెయిన్ - రష్యా పై ఫోకస్ మరాఠాపై లేదు
Sanjay Raut Modi : శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. శివసేన మౌత్ పీస్ గా భావించే సామ్నా పత్రికలో ప్రతి వారం వివిధ అంశాలపై కాలమ్ రాస్తుంటారు సంజయ రౌత్.
ఈసారి ప్రధానంగా సరిహద్దు వివాదంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓ వైపు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య గత కొంత కాలం నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతూ ఉన్నా ఇప్పటి వరకు కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీకి(PM Modi) దేశం వెలుపల ఉక్రెయిన్ , రష్యా వివాదంలో జోక్యం చేసుకునేందుకు సమయం ఉంటుందని, కానీ దేశంలో అంతర్భాగంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల మధ్య నెలకొన్న విభేదాలను , సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు మనస్సు ఒప్పడం లేదని వాపోయారు.
ఒక రకంగా మరాఠాపై వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చులకనగా మాట్లాడినా ప్రధాని మోదీ, అమిత్ షా నోరు మెదపడం లేదన్నారు.
ఇక సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసలు ఉన్నారో లేదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు సంజయ్ రౌత్(Sanjay Raut) . రష్యా, ఉక్రెయిన్ పై ఫోకస్ పెట్టండి కానీ మహారాష్ట్ర, కర్నాటకపై కాదని మండిపడ్డారు. ఈ రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి.
కానీ సమస్యను ఎందుకు పరిష్కరించలేక పోతున్నారంటూ సామ్నాలో ప్రశ్నించారు సంజయ్ రౌత్.
Also Read : ప్రేమ కోసం మరణిస్తున్నారు – సీజేఐ