Sanju Samson : భారత స్టార్ హిట్టర్ గా పేరొందిన కేరళ స్టార్ హిట్టర్ మరోసారి సత్తా చాటాడు. తన ఐపీఎల్ కెరీర్ లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో సత్తా చాటాడు.
కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సంజూ శాంసన్ (Sanju Samson)55 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 5 సిక్సర్లు 3 ఫోర్లు ఉన్నాయి. శాంసన్ కు లీగ్ లో ఇదే ఫస్ట్ మ్యాచ్ . యశస్వి జైశ్వాల్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సంజూ దుమ్ము రేపాడు.
హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఐపీఎల్ లో అరుదైన ఫీట్ సాధించాడు. ఓ టీమ్ తరపున ప్రారంభ మ్యాచ్ లోనే మూడు సీజన్లలో వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
గతంలో 2020లో జరిగిన ఐపీఎల్ లీగ్ లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 32 బంతులు ఆడి 74 పరుగులు చేశాడు. గత ఏడాది దుబాయి వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 63 బంతులు ఆడి 119 రన్స్ సాధించాడు.
ఇక తాజాగా ఎస్ ఆర్ హెచ్ తో జరిగిన మ్యాచ్ లో 27 బంతుల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున అత్యధిక మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా అరుదైన ఘనత సృష్టించాడు సంజూ శాంసన్(Sanju Samson).
గత ఏడాది రాజస్తాన్ యాజమాన్యం శాంసన్ కు కెప్టెన్ గా ఛాన్స్ ఇచ్చింది. ఈసారి కూడా రిటైన్ చేసుకుని పగ్గాలు అప్పగించింది.
Also Read : గంభీర్ సలహా మరిచి పోలేను