Sanju Samson : ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో తుఫాన్ సృష్టించిన సంజు శాంసన్

‘సూర్యభాయ్ లాంటి కెప్టెన్, గంభీర్ లాంటి సపోర్టివ్ కోచ్‌ ఉండటం ఎంతో కీలకం...

Sanju Samson : అటాకింగ్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తూ చెలరేగిపోయాడు సంజూ శాంసన్(Sanju Samson). బాదుడు అంటే ఇదీ అనేలా అతడి బ్యాటింగ్ సాగింది. ఉతుకుడే పనిగా పెట్టుకున్న స్టైలిష్ బ్యాటర్.. సౌతాఫ్రికా బౌలర్లను చీల్చిచెండాడాడు. ఆ జట్టుతో జరిగిన తొలి టీ20లో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సూపర్ సెంచరీతో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. నీళ్లు తాగినంత ఈజీగా ఫోర్లు, సిక్సులు కొడుతూ బ్యాటింగ్ ఇంత ఈజీనా అనిపించేలా ఆడాడు. ప్రత్యర్థి మీద మెరుపులా పడిన సంజూ.. భారీ షాట్లతో స్టేడియంలో తుఫాన్ సృష్టించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ టీమిండియా నయా హీరో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Sanju Samson Game…

హెడ్కోచ్ గౌతం గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ వల్లే ఈ సక్సెస్ వచ్చిందన్నాడు సంజూ(Sanju Samson). బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు సూర్య తనతో మాట్లాడాడని.. వచ్చే ఏడు మ్యాచ్‌ల పాటు నువ్వే టీమ్‌కు ఓపెనర్‌వి అని హామీ ఇచ్చాడని తెలిపాడు. సారథి చెప్పిన ఆ ఒక్క మాట తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నాడు. అక్కడి నుంచి అంతా మారిపోయిందన్నాడు. తాను పరుగులు చేసినా, చేయకపోయినా.. సక్సెస్ అయినా, ఫెయిలైనా ఓపెనర్‌గా కంటిన్యూ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారని వ్యాఖ్యానించాడు. ఇది తప్పక రాణించాలి, పరుగులు చేయాలనే కసిని పెంచిందన్నాడు సంజూ. కెప్టెన్ మాటలు తనకు కొండంత అండగా నిలిచాయన్నాడు.

‘సూర్యభాయ్ లాంటి కెప్టెన్, గంభీర్ లాంటి సపోర్టివ్ కోచ్‌ ఉండటం ఎంతో కీలకం. నేను ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు వాళ్లు నాకు అండగా నిలబడ్డారు. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు సాయం చేశారు. నాకు కాల్స్ చేసి మాట్లాడారు. నా బ్యాటింగ్ టెక్నిక్‌తో పాటు ఇతర అంశాల్లో ఎలా మెరుగవ్వాలో సలహాలు ఇచ్చి ముందుకు నడిపించారు. నేను స్పిన్ ఆడటంలో తడబడుతున్నానని సూర్య ఓ సూచన చేశాడు. కేరళలోని లోకల్ స్పిన్నర్లను పిలిపించి గట్టిగా ప్రాక్టీస్ చేయమన్నాడు. వాళ్లు నా మీద నమ్మకం ఉంచడం, సలహాలు ఇచ్చి ప్రోత్సహించడంతో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకున్నా. కష్టపడి బ్యాటింగ్‌లో మెరుగుపడ్డా. వాళ్లు నా మీద ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్. ఇది నా కెరీర్‌కు బిగినింగ్‌గా భావిస్తున్నా. మరింత కష్టపడి దేశానికి మరిన్ని విజయాలు అందించేందుకు ప్రయత్నిస్తా’ అని శాంసన్ చెప్పుకొచ్చాడు.

Also Read : Gudivada Amarnath : కూటమి ప్రభుత్వం ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది..

Leave A Reply

Your Email Id will not be published!