SRH vs RR : ఐపీఎల్ 2022 లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపింది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR )రాజసాన్ని ప్రదర్శించింది. మొదట్లో తడబడినా తర్వాత రెచ్చి పోయారు జట్టు ఆటగాళ్లు. కెప్టెన్ సంజూ శాంసన్ , యశశ్వి జైస్వాల్ ,దేవదత్ పడిక్కల్ , హెట్మైర్ దుమ్ము రేపారు.
సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పూణే లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పరుగుల వరద పారింది. శాంసన్ 27 బంతులు ఆడి 55 రన్స్ చేసి సత్తా చాటాడు.
చివర్లో హెట్ మైర్ 13 బంతులు ఆడి 32 రన్స్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఐపీఎల్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోర్.
ఇక దేవదత్ పడిక్కల్ 41 రన్స్ చేస్తే జోస్ బట్లర్ 35 పరుగులు చేసి జట్టు స్కోరు పెంచేందుకు దోహద పడ్డారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో నటరాజన్ , మాలిక్ చెరో రెండు వికెట్లు తీశారు.
భవనేశ్వర్ , షెపర్డ్ చెరో వికెట్ తీశారు. ఇక శాంసన్ పరుగుల్లో 5 సిక్సర్లు 3 ఫోర్లు ఉన్నాయి. సన్ రైజర్స్ బౌలర్లు వైడ్ బాల్స్ , నో బాల్స్ ఎక్కువగా వేయడం కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు (SRH vs RR )కలిసి వచ్చిందని చెప్పక తప్పదు.
మరి రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా లేక ఓడి పోతుందా అన్నది కొద్ది సేపు ఆగితే తెలుస్తుంది.
Also Read : ‘ఆయుష్’ ఆట తీరు అద్భుతం