Sanju Samson : శాంసన్ రాణించినా ఒక్క మ్యాచేనా
బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై ఆగ్రహం
Sanju Samson : స్టార్ హిట్టర్ గా పేరొందిన కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ కు కేవలం ఇంగ్లండ్ టూర్ లో ఒకే ఒక్క టి20 మ్యాచ్ కే పరిమతం చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.
పూర్తిగా ముంబైకి చెందిన ప్లేయర్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారంటూ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ట్విట్టర్ వేదికగా సంజూ శాంసన్(Sanju Samson) కు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు.
ఇదే సమయంలో చేతన్ శర్మపై నిప్పులు చెరుగుతున్నారు. మూడు టి20 మ్యాచ్ లకు గాను ఒక్క మ్యాచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా రెండో, మూడో టి20 మ్యాచ్ లకు దూరం పెట్టారు.
ఇక ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ కారణంగా మొదటి 20 మ్యాచ్ కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులో లేక పోవడంతో సంజూ శాంసన్ ను తీసుకుంది. సంజూ శాంసన్ గత కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా పెట్టారు.
గత సంవత్సరం టి20 ప్రపంచ కప్ కోసం టీమ్ లో లేడు. శ్రీలంక, వెస్టిండీస్ తో జరిగిన స్వదేశీ సీరీస్ ల కోసం తిరిగి తీసుకున్నారు. ఐర్లాండ్ లో జరిగిన రెండు మ్యాచ్ ల టి20లో రెండో మ్యాచ్ లో ఆడించారు.
42 బంతులు ఆడి 9 ఫోర్లు 4 సిక్సర్లు 77 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా తో జరిగిన స్వదేశీ సీరీస్ కు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ ఆశ్చర్య కరంగా తొలగించబడ్డారు.
దీపక్ హూడాతో కలిసి శాంసన్(Sanju Samson) 176 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. మొత్తంగా ట్విట్టర్ లో బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
Also Read : సంజూ శాంసన్..హూడా అరుదైన రికార్డ్