Sanju Samson Fans : సంజూ శాంసన్ ఫ్యాన్స్ వినూత్న నిరసన
బీసీసీఐ సెలెక్టర్ల నిర్వాకంపై ఆగ్రహం
Sanju Samson Fans : కేరళ స్టార్, మోస్ట్ పాపులర్ హిట్టర్ గా సంజూ శాంసన్ పేరొందాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాటర్ గా ఇటు కెప్టెన్ గా మన్ననలు పొందాడు.
గత కొంత కాలంగా అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో రాణిస్తున్నా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు.
కేవలం ఒకటి లేదా అరకొర మ్యాచ్ లకు మాత్రమే ఎంపిక చేస్తున్నారు. ఇటీవల ఐర్లాండ్, విండీస్ సీరీస్ లలో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు.
ప్రధానంగా పొట్టి ఫార్మాట్ లో మరో క్రికెటర్ రిషబ్ పంత్ కంటే సూపర్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ బీసీసీఐ తాజాగా ఆస్ట్రేలియాలో జరిగే టి20 వరల్డ్ కప్ లో ఎంపిక చేసిన టీమ్ లో సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వలేదు.
దీంతో తాజా, మాజీ ఆటగాళ్లు పెద్ద ఎత్తున మండిపడ్డారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా సంజూ శాంసన్ ఫ్యాన్స్(Sanju Samson Fans), నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారంతా గణాంకాలతో సహా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మపై నిప్పులు చెరిగారు.
ఈ ఏడాది 2022లో ఆరు టి20 మ్యాచ్ లు ఆడాడు. 44.75 సగటుతో 179 రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ కూడా ఉంది.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 28న గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా టి20 మ్యాచ్ సందర్భంగా తిరువనంతపురంలోని మద్దతుదారులు బీసీసీఐకి వ్యతిరేకంగా సంజూ శాంసన్ టీషర్టులు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు.
Also Read : వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ ఆడేది కష్టమే