Sanju Samson Bumrah : శాంస‌న్ ఫిట్ బుమ్రా డౌట్

ఆసిస్ సీరీస్ కు సిద్దం

Sanju Samson Bumrah : గాయం కార‌ణంగా టాప్ రేంజ్ ఆట‌గాళ్లుగా పేరొందిన జ‌స్ ప్రీత్ బుమ్రా, సంజూ శాంస‌న్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది. క్రికెట్ వ‌ర్గాల అంచ‌నా మేర‌కు ఆస్ట్రేలియాతో జ‌రిగే వ‌న్డే సీరీస్ కోసం అందుబాటులోకి కేర‌ళ స్టార్(Sanju Samson) రానున్న‌ట్లు టాక్.

ఇప్ప‌టికే స్పీడ్ స్ట‌ర్ గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా తీవ్రంగా గాయ‌ప‌డి ప‌లు సీరీస్ ల‌కు దూర‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం ప్రాక్టీస్ చేస్తున్నా తుది జ‌ట్టు ఎంపిక‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న‌ది ఇంకా తేలాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక‌, న్యూజిలాండ్ సీరీస్ కు దూరంగా ఉన్నాడు బుమ్రా. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు వ‌న్డే సీరీస్ తో పాటు టెస్టు సీరీస్ ఆడ‌నుంది. ఇందులో భాగంగా మూడు వ‌న్డేలు, నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది ఆస్ట్రేలియా.

ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు శ్రీ‌లంక‌తో జ‌రిగిన టీ20, వ‌న్డే సీరీస్ ను కైవ‌సం చేసుకుంది. మ‌రో వైపు ప్ర‌స్తుతం న్యూజిలాండ్ తో ఆడుతోంది.

ఆ జ‌ట్టును 3-0 తేడాతో ఓడించి వ‌న్డే సీరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే టీ20 తొలి మ్యాచ్ లో భార‌త్ ను మ‌ట్టి క‌రిపించింది కీవీస్. మార్చి 17 నుంచి వ‌న్డే సీరీస్ అందుబాటులోకి రానుంది.

శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో గాయ‌ప‌డిన సంజూ శాంస‌న్(Sanju Samson) పూర్తి ఫిట్ గా ఉండ‌డంతో తుది జ‌ట్టులోకి ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక బుమ్రా వ‌స్తాడా లేదా అన్న‌ది క‌ష్ట‌మే. ఇక ఎన్సీఏ నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో సంజూ శాంస‌న్ పాసైన‌ట్లు స‌మాచారం. బుమ్రా ఇంకా కోలుకోలేదు.

Also Read : గుజ‌రాత్ జెయింట్స్ మెంట‌ర్ గా మిథాలీ

Leave A Reply

Your Email Id will not be published!