Sanju Samson : శాంసన్ కు ఛాన్స్ దక్కేనా
అయ్యర్ కు గాయం వన్డేకు దూరం
Sanju Samson Squad : భారత్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సీరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది భారత జట్టు. వన్డే జట్టుకు ఇప్పటికే ఫామ్ లో ఉన్నా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పక్కన పెట్టింది స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్.
ఈనెల 17 నుంచి వన్డే సీరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఎంపికైన స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నట్టుండి గాయపడ్డాడు. నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. త్వరలో జరిగే ఐపీఎల్ లో కూడా ఆడలేక పోవచ్చని సమాచారం. ఫామ్ లో ఉన్న శాంసన్ ను తీసుకుంటారా లేదా అన్న ఉత్కంఠ(Sanju Samson Squad) నెలకొంది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇకనైనా ఛాన్స్ ఇస్తుందా అన్నది వేచి చూడాలి.
కాగా కీవీస్ టూర్ నుండి సంజూ శాంసన్ వన్డే జట్టు నుండి తొలగించబడ్డాడు. అప్పటి నుండి 50 ఓవర్ల ఆట ఆడలేదు. టి20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ జనవరిలో శ్రీలంక సీరీస్ తో మోకాలి గాయంతో పక్కన పెట్టింది బీసీసీఐ. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథ్యం వహించనున్నాడు. మూడు వన్డేలు మార్చి 17, 19, 22వ తేదీల్లో వరుసగా ముంబై, వైజాగ్ , చెన్నైలలో జరగనున్నాయి.
ఇప్పటి వరకు ఉన్న టీమిండియా లో రోహిత్ శర్మ, గిల్ , కోహ్లీ, సూర్య, కేఎల్ రాహుల్ , కిషన్ , పాండ్యా , జడేజా , కుల్దీప్ , సుందర్ , చాహల్ , షమీ, సిరాజ్ , మాలిక్ , ఠాకూర్ , పటేల్ , ఉనాద్కత్ ఉన్నారు. మొత్తంగా ఆడే శాంసన్ ను పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
Also Read : దర్జాగా ప్లే ఆఫ్ కు ముంబై ఇండియన్స్