Sanju Samson : సంజూ శాంసన్ పరిచయం అక్కర్లేని పేరు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021లో అత్యధిక పరుగుల జాబితాలో మనోడు ఉన్నాడు.
ఇక ముంబై వేదికగా జరుగుతున్న మెగా రిచ్ లీగ్ లో భాగంగా ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ లు ఆడితే ఇందులో మూడింట్లో గెలుపొంది రెండు మ్యాచ్ లలో పరాజయం పాలైంది.
పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడి పోయింది. ఓ వైపు ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఇన్నింగ్స్ తో మెరిస్తే కెప్టెన్ గా బాధ్యతాయుతంగా ఆడాల్సిన సంజూ శాంసన్ అత్యంత నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ పారేసుకున్నాడు.
ఈ తరుణంలో క్రికెట్ అభిమానులు శాంసన్(Sanju Samson )ఆట తీరుపై మండిపడుతున్నారు. ప్రత్యర్థి జట్టు గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యాను చూసి నేర్చు కోవాలని సూచిస్తున్నారు.
193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ లో ఒకే ఒక్కడు బట్లర్ మెరిశాడు. వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చిన సంజూ శాంసన్ కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు.
లేని పరుగు కోసం వెళ్లి రనౌట్ అయి పెవిలియన్ దారి పట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మాత్రమే ఆడిన సంజూ శాంసన్ ఆ తర్వాత ఏ మ్యాచ్ లోనూ ఆశించిన రీతిలో రాణించ లేక పోయాడు.
పూర్తిగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. ముందుండి నడిపించాల్సిన నాయకుడు చేతులెత్తేస్తే ఇక మిగతా ఆటగాళ్లు ఎలా ఆడతారో అర్థం చేసుకోవాలి.
ఇకనైనా శాంసన్ మారాలి. వన్ డౌన్ లోనో లేదా మూడో డౌన్ లో రావాలి. దేవదత్ కు బదులు రియాన్ పరాగ్ ను ఓపెనర్ గా పంపిస్తే బెటర్.
Also Read : గుజరాత్ భళా రాజస్థాన్ విలవిల