Sanju Samson : ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ ఈనెల 26 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. గతంలో 14వ సీజన్ వరకు ఎనిమిది జట్లు పాల్గొనగా ఈసారి జరిగే 15వ సీజన్ లో రెండు కొత్త జట్లతో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.
ఆయా జట్లు ఇప్పటికే మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. భారీ ఎత్తున వెచ్చించాయి. ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.
ఇక 29న రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఢీకొట్టనుంది. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ లాంటి స్పిన్నర్లను ఈసారి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్.
తాజాగా కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది. ఇక ఆర్ఆర్ కెప్టెన్ , కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ (Sanju Samson)ప్రాక్టీస్ లో మునిగి పోయాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టాడు.
ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నాక నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మరింతగా రాటు దేలేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. జిమ్ లో ఎక్కువగా టైమ్ కేటాయిస్తూ కండలు పెంచుతున్నాడు.
మనోడు సిక్స్ ల్ని అలవోకగా కొట్టడంలో అందె వేసిన చేయి. తన ఫిట్ నెస్ బాడీతో ఉన్న ఫోటోను తాజాగా ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ పిక్ వైరల్ గా మారింది.
అచ్చం హీరోలాగా ఉన్నావంటూ నెటిజన్లతో పాటు శాంసన్ అభిమానులు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. క్వారంటైన్ గోయింగ్ స్ట్రాంగ్ అంటూ క్యాప్షన్ కూడా ఆ ఫోటోకు జత చేయడం విశేషం.
Also Read : పిచ్ లపై బీసీసీఐని సంప్రదిస్తే బెటర్