Anand Mahindra : ఈ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆయనకు మరో కోణం కూడా ఉంది. అదేమిటంటే వ్యాపారంతో పాటు దేశం పట్ల ప్రేమ, అభిమానం.
అంతకంటే ఈ దేశం గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఊరుకోరు. నిత్యం వ్యాపార పరంగా బిజీగా ఉన్నప్పటికీ తాను మాత్రం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు.
ఏ ఒక్క అంశాన్ని ఆయన వదిలి పెట్టరు. అంతే కాదు ఈ దేశానికి ఆదర్శ ప్రాయంగా, స్పూర్తి దాయకంగా నిలిచే వ్యక్తులు, అంశాలను ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ప్రస్తావిస్తూ వుంటారు.
అంతే కాదు అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తారు. ఫోటోలు కూడా పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనంద్ మహీంద్రాను సోషల్ మీడియా ఎక్స్ పర్ట్ అని పేర్కొనడంలో తప్పు లేదు.
ప్రతి రోజూ ప్రస్తుతం ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తూ వస్తున్న ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని దాని పోకడలను ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచానికి కావాల్సింది యుద్దం కాదని శాంతి మాత్రమేనని ఆయన నొక్కి వక్కానిస్తున్నారు.
ఇదే సమయంలో తాజాగా ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ లోని ఖేర్ సన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి.
ఆ బలగాలకు వ్యతిరేకంగా అక్కడ నిరాయుధలైన పౌరులు అడ్డు చెప్పారు. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆనంద్ మహీంద్రా.
Also Read : ఎల్ఐసీలో 20 శాతం ఎఫ్డీఐలకు ఓకే