Saudi Aramco : సౌదీ అరామ్ కో యాపిల్ ను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలబెట్టింది. సౌదీ అరేబియా జాతీయ పెట్రోలియం , సహజ వాయువు కంపెనీ మార్కెట్ ముగిసే సమయానికి దాని షేర్ల ధర ఆధారంగా $2.42 ట్రిలియన్ల వాల్యూ కలిగి ఉంది.
పెరుగుతున్న చమురు ధరలు షేర్లను పెంచడం, టెక్ స్టాక్ లు క్షీణించడంతో వరల్డ్ లో టాప్ కంపెనీగా నిలిచింది. సౌదీ అరేబియా (Saudi Aramco)జాతీయ పెట్రోలియం, సహజ వాయువు కంపెనీ వరల్డ్ లోనే టాప్ చమురు ఉత్పత్తి కంపెనీగా బిల్ చేయబడింది.
అదే సమయంలో గత నెలలో దాని షేరు తగ్గింది. అప్పుడు దాని విలువ $2.37 ట్రిలియన్ల వాల్యూ కలిగి ఉంది. బలమైన వినియోగదారుల డిమాండ్ తో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో యాపిల్ ఊహించిన దాని కంటే మెరుగైన లాభాలను నమోదు చేసినప్పటికీ షేర్ ధర పడి పోయింది.
చైనా కోవిడ్ -19 లాక్ డౌన్ , కొనసాగుతున్న సరఫరా గొలుసు కష్టాలు జూన్ త్రైమాసిక ఫలితాలను $4 నుండి $ 8 బిలియన్ల వరకు తగ్గించ వచ్చని ఆపిల్ హెచ్చరించింది.
కోవిడ్ సంబంధిత అంతరాయాలు, పరిశ్రమ వ్యాప్త సిలికాన్ కొరత కారణంగా ఏర్పడిన సరఫరా పరిమితులు తమ ఉత్పత్తుల కోసం కస్టమర్ డిమాండ్ తీర్చగల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మాస్త్రి పేర్కొన్నారు.
ఇదే సమయంలో చమురు దిగ్గజం సౌదీ అరామ్ కో గత సంవత్సరంలో 124 శాతం నికర లాభం ఆర్జించింది. యెమెన్ తిరుగుబాటుదారుల దాడి వల్ల ఉత్పత్తిలో కొంత ఇబ్బంది ఏర్పడిందని కంపెనీ తెలిపింది.
Also Read : ట్రంప్ కు ఎలోన్ మస్క్ గుడ్ న్యూస్