Vijay Hazare Trophy 2022 : సౌరాష్ట్ర విజయ్ హజారే ఛాంపియన్
మహారాష్ట్రపై ఘన విజయం
Vijay Hazare Trophy 2022 : దేశీవాళి క్రికెట్ లో పెను సంచనాలకు కేంద్రంగా మారింది విజయ్ హజారే టోర్నీ(Vijay Hazare Trophy 2022). ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. కొత్త చరిత్ర సృష్టించారు.
ఇక టోర్నీ ఫైనల్లో మహారాష్ట్రకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది సౌరాష్ట్ర. దేశీవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది. విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా టోర్నమెంట్ ప్రారంభమైన నాటి నుంచి ఫైనల్ వరకు సౌరాష్ట్ర అన్ని రంగాలలో రాణించింది. అత్యంత నిలకడగా రాణిస్తూ తనను తాను ఛాంపియన్ గా నిరూపించుకుంది.
ఇక ఫైనల్ మ్యాచ్ మహారాష్ట్రతో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది. సౌరాష్ట్ర మరాఠాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 5 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. వరుసగా రెండోసారి విజయ్ హజారే ట్రోఫీని స్వంతం చేసుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసింది మహారాష్ట్రం. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 248 రన్స్ చేసింది. అనంతరం 249 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది సౌరాష్ట్ర. ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు.
ఇక ఎప్పటి లాగే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి రెచ్చి పోయాడు. వరుసగా హ్యాట్రిక్ సెంచరీతో దుమ్ము రేపాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. 7 ఫోర్లు 4 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. అయినా ఫలితం లేక పోయింది. అనంతరం 249 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగింది సౌరాష్ట్ర. కేవలం 46.3 ఓవర్లలోనే టార్గెట్ ను సులభంగా ఛేదించింది.
షెల్డన్ జాక్సన్ దుమ్ము రేపాడు. 12 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 133 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అజేయ సెంచరీతో సౌరాష్ట్రకు కప్ ను తీసుకు వచ్చేలా చేశాడు. అద్భుతంగా రాణించిన జాక్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక టోర్నీలో అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్ కు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ లభించింది.
Also Read : జర్మనీ..ఉరుగ్వే ఇంటిబాట