ENGW vs SAW T20 : వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన సౌతాఫ్రికా
రెండో సెమీస్ లో ఇంగ్లండ్ కు చేదు అనుభవం
SAW vs ENG T20 W Cup : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. టోర్నీలో భాగంగా తొలి సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి దాకా పోరాడింది. తాజాగా రెండో సెమీ ఫైనల్ లో ఊహించని రీతిలో ఆతిథ్య జట్టు సౌతాఫ్రికా(SAW vs ENG T20 W Cup) కోలుకోలేని షాక్ ఇచ్చింది. టైటిల్ ఫెవరేట్ గా భావిస్తున్న ఇంగ్లండ్ కు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. తజ్మిన్ బ్రిట్స్ , అయాబొంగా ఖాకా కీలకమైన పాత్ర పోషించారు.
తమ జట్టును విజయం సాధించేలా సత్తా చాటారు. ఈ ఇద్దరు సఫారీని ఫైనల్ లోకి చేరుకునేలా దగ్గరుండి నడిపించారు. దీంతో 6 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేశారు. కీలక మ్యాచ్ లో భాగంగా తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్ కు దిగింది. నాలుగు వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసింది నిర్ణీత 20 ఓవర్లలో. బ్రిట్స్ 68 పరుగులు చేసింది. అంతే కాదు నాలుగు అద్బుతమైన క్యాచ్ లు పట్టుకుని ఔరా అనిపించింది.
దీంతో 165 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఆదివారం జరిగే కీలకమైన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఎందుకంటే హోం గ్రౌండ్ లో జాట్టుకు మరింత బలాన్ని ఇచ్చేలా చేసింది. ఈ సెమీస్ లో బ్రిట్స్ పట్టిన క్యాచ్ లు అమోఘం. ఒకవేళ ఆమె గనుక సూపర్ ఫీల్డింగ్ చేయక పోతే ఇంగ్లండ్ గెలిచి ఉండేది. అటు బ్యాటింగ్ లో ఫీల్డింగ్ లో అద్బుతమైన ప్రదర్శన చేపట్టింది .
Also Read : పోరాడి ఓడిన టీమిండియా