SC Rejects Pil : అంబానీకి అభయం భద్రత కట్టుదిట్టం
స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం
SC Rejects Pil : భారతీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముకేష్ అంబానీ ఫ్యామిలీకి ఊరట లభించింది. వారికి పెద్ద ఎత్తున కేంద్రం సెక్యూరిటీ కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. ముంబైలో ఉంటున్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ , కుటుంబీకులకు కేంద్ర ప్రభుత్వం అందించే భద్రతను కొనసాగించ వచ్చని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా అంబానీ, ఫ్యామిలీకి ఎలా కేంద్రం భద్రత(SC Rejects Pil) కల్పిస్తుందంటూ త్రిపుర హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని కొట్టి వేస్తూ శుక్రవారం తాజా తీర్పు వెలువరించింది.
ఇక ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదా పీఈఐఎల్ పై త్రిపుర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర సర్కార్ చేసిన అప్పీల్ ను భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
అంబానీ , ఫ్యామిలీకి సెక్యూరిటీ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గత నెల చివర్లో కోర్టు తాత్కాలికంగా నిలిపి వేసింది.
కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా త్రిపుర లోని పిటిషనర్ బికాస్ సాహాకు ముంబైలో అందించిన వ్యక్తుల భద్రతకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
త్రిపుర హైకోర్టు మే 31, జూన్ 21న రెండు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంబానీ, భార్య, పిల్లల బెదిరింపు అవగాహన, అచనా నివేదికకు సంబంధించి కేంద్ర హోం శాఖ నిర్వహించే అసలు ఫైలును తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
దీంతో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Also Read : ఆకాసా ఎయిర్ లైన్స్ బుకింగ్ షురూ