Scotland Win : వరల్డ్ కప్ నుంచి జింబాబ్వే ఔట్
31 రన్స్ తేడాతో స్కాట్లాండ్ చేతిలో ఓటమి
Scotland Win : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నుంచి మరో జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. మొన్న బలమైన వెస్టిండీస్ జట్టు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ ను స్వంతం చేసుకున్న ఘనత ఆ జట్టుది. తాజాగా స్కాట్లాండ్ జట్టు సంచలనం సృష్టించింది. ఏకంగా 31 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తదరుపరి మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో పోటీ పడనుంది.
వరల్డ్ కప్ లో అర్హత సాధించిన సూపర్ సిక్స్ లో శ్రీలంక తొలి స్థానంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్(Scotland) 234 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే 203 రన్స్ కే చాప చుట్టేసింది. గెలుపొందిన జట్టులో క్రిస్ సోల్ 33 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. స్కాట్లాండ్ కు అపూర్వమైన గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
తమ ఆటగాళ్లు అద్బుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించారని, ఈ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందన్నాడు స్కాట్లాండ్ స్కిప్పర్ రిచీ బెరింగ్టన్. ఆరంభంలోనే వికెట్లను తీయడం వల్ల ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం వహించామని తెలిపాడు కెప్టెన్. ఇదిలా ఉండగా ఇది తమ టీమ్ కు ఊహించని షాక్ అని వాపోయాడు జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్.
Also Read : Ajit Agarkar : బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా అగార్కర్
