Seats For Sale Comment : సీట్ల పంప‌కం కోట్ల‌ల్లో పందేరం

తెలంగాణ‌లో ఆశావాహుల ఆగ్ర‌హం

Seats For Sale Comment : ఎన్నిక‌ల న‌గారా మోగడంతో తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ముందు నుంచి నిజాయితీగా, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేస్తూ వ‌చ్చిన నేత‌లు, శ్రేణులు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డంతో జ‌నం ఎన్నిక‌ల మూడ్ లోకి వెళ్లి పోయారు. మొత్తం రాష్ట్రంలో 119 సీట్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వానికి ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకునే అధికారం ఉండ‌దు. హామీలు ఇవ్వ‌డం, ఆచ‌ర‌ణ‌కు నోచుకోని తాయిలాలు ప్ర‌క‌టించ‌డంపై నిషేధం విధించింది ఈసీ.

Seats For Sale Comment Viral

గ‌తంలో రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ద్యం ఏరులై పారింది. నోట్ల క‌ట్ట‌లు గుట్ట‌లుగా దొరికాయి. చాలా చోట్ల ప‌ట్టుప‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోని 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రిపేందుకు ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇక తెలంగాణ‌లో ఎక్కువ‌గా రాజ‌కీయ చైత‌న్యం క‌లిగి ఉండ‌డంతో ప్ర‌తిదీ చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం అధికారంలో భారత రాష్ట్ర స‌మితి పార్టీ ఉండ‌గా, ప్ర‌తిప‌క్షంలో కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP), బీఎస్పీ, ఎంఐఎం, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు యుద్ద రంగంలోకి దిగాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప్ర‌తి రోజూ వంద‌ల కోట్ల‌కు పైగా పట్టు ప‌డుతున్నాయి.

ఇప్ప‌టికే ప‌వ‌ర్ లో ఉన్న గులాబీ ప్ర‌జా ప్ర‌తినిధులు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు సైతం వెనుకాడ‌డం లేద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌వ‌ర్ లోకి రావాల‌ని తెగ ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో అస‌మ్మ‌తి రాగం పెరిగింది. ఎక్క‌డ చూసినా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధానంగా టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పార్టీని వీడిన నేత‌లు, డీసీసీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన వాళ్లు. టీపీసీసీ కార్య‌ద‌ర్శి కురువ విజ‌య్ కుమార్ , మాజీ మంత్రి నాగం జ‌నార్ద‌న్ రెడ్డి రూ. 10 కోట్ల‌కు ఒక సీటు చొప్పున 60 సీట్ల‌ను అమ్ముకున్నాడ‌ని, చివ‌ర‌కు టీపీసీసీని బేరం పెట్టాడంటూ ఆరోపించారు.

చివ‌ర‌కు రేవంత్ రెడ్డి పేరును కూడా బీఆర్ఎస్ మినిష్ట‌ర్ కేటీఆర్ మార్చేశాడు. ఆయ‌న‌కు రేటెంత రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఇదే నేమ్ వైర‌ల్ గా మారింది. మొత్తంగా సీట్ల పంప‌కం, అభ్య‌ర్థుల ఎంపిక ఆయా పార్టీల‌కు వ‌రంగా మారింది. ప్ర‌తి చోటా ఇదే వ్య‌వ‌హారం కొన‌సాగుతోంది. ఇక సిస్ట‌మాటిక్ పార్టీగా గుర్తింపు పొందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP) కూడా ఇప్పుడు మొత్తం వ్యాపార‌స్తులు, అక్ర‌మార్కుల‌తో నిండి పోయింది. కార్పొరేట్ కంపెనీల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ..దేశంలో ఏ పార్టీకి లేనంత‌గా ఎల‌క్టోర‌ల్ బాండ్ల రూపేణా కోట్లాది రూపాయ‌లు స‌మ‌కూరాయి. ఇక బీఎస్పీ మాత్రం ప్ర‌జ‌లు ఇచ్చిన డ‌బ్బులు చాలంటోంది. ఇక వైఎస్సార్ టీపీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే వైఎస్సార్ కుటుంబం భారీగా ఆదాయం క‌లిగి ఉంది. ఇక ఎంఐఎం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఏ పార్టీ ప‌వ‌ర్ లో ఉంటే ఆ పార్టీకి స‌పోర్ట్ గా నిలుస్తుంది. మొత్తంగా తెలంగాణ‌లో ప‌ద‌వుల పంప‌కం కోట్ల‌ల్లో బేరం అంటూ ఎక్కువ‌గా వినిపిస్తోంది.

Also Read : Dava Vasanatha Suresh : జీవ‌న్ రెడ్డి కామెంట్స్ పై కన్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!