Secret Cameras: గుంటూరు లేడీస్ హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాల కలకలం

గుంటూరు లేడీస్ హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాల కలకలం

 

 

గుంటూరులో ఓ లేడీస్ హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్‌ లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్‌లు చేయటం… అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ విద్యార్థునులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో కేసు నమోదు చేసిన అరండల్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా స్థానిక మహిళా ఎస్సై లేడీస్ హాస్టల్ ను పరిశీలించి… విద్యార్ధినులను, సిబ్బందిని విచారించారు.

 

గత ఏడాది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బ‌య‌ట‌ప‌డింది. దీనితో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. తెలంగాణలోని ఈ ఏడాది మార్చి నెలలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్‌ లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్‌ లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి… అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్టల్‌ నిర్వాహకుడిని అరెస్ట్‌ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!