Mamata Banerjee : సౌరవ్ గంగూలీకి భద్రత కరువు – దీదీ
కేంద్ర సర్కార్ పై సీరియస్ కామెంట్స్
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ పట్ల అత్యంత అవమానకరమైన రీతిలో వ్యవహరించారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ రేసులో లేకుండా చేశారని మండిపడ్డారు.
చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉండాలంటే అక్టోబర్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఉండాలనేది బీసీసీఐ నిర్ణయిస్తుంది. అక్టోబర్ 18న ముంబైలో సమావేశమైన బీసీసీఐ పాలక వర్గం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కానీ ఐసీసీ చైర్మన్ కోసం ఎవరిని ఎంపిక చేయాలనేది స్పష్టం చేయలేదు.
దీంతో బీసీసీఐ బాస్ తిరిగి కావాలని అనుకున్న గంగూలీకి(Sourav Ganguly) కోలుకోలేని షాక్ తగిలింది. ఇదే సమయంలో ఐసీసీ చైర్మన్ అవుదామని అనుకుంటే అక్కడా తనకు భంగపాటు తప్పలేదు. ఈ విషయంలో ఐసీసీ చైర్మన్ పదవి కోసం గంగూలీని నామినేట్ చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాసింది.
అది దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన క్రికెటర్లలో గంగూలీ ఒకరని పేర్కొన్నారు. ఐసీసీలో పోటీలో లేకుండా బీసీసీఐ నామినేషన్ నుండి తొలగించారు. వేరొకరి ఆసక్తులను కాపాడు కోవడానికి గంగూలీ ఛాన్స్ మిస్సయ్యాడు. ఇది సిగ్గు లేని, నీతి మాలిన రాజకీయం అంటూ ధ్వజమెత్తారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
ఇదిలా ఉండగా అమిత్ షా తనయుడు జే షా మరోసారి కార్యదర్శిగా ఎలా ఎన్నికవుతారంటూ దీదీ ప్రశ్నించారు.
Also Read : టి20 వరల్డ్ కప్ సూపర్ 12కు శ్రీలంక