Seema Mustafa : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చీఫ్ గా సీమా
మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ముస్తాఫా
Seema Mustafa : భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కు అధ్యక్షురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సీమా ముస్తాఫా. ఆమె ప్రస్తుతం ది సిటిజన్ డిజిటల్ మీడియాకు ఎడిటర్ గా ఉన్నారు.
ప్రధాన కార్యదర్శిగా కారవాన్ ఎడిటర్ అనంత్ నాథ్ , కోశాధికారిగా సకల్ మీడియా గ్రూప్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ పవార్ నియమితులయ్యారు.వీరి ఎన్నికను ముగ్గురు సభ్యుల ఎన్నిక కమిటీ వెల్లడించింది.
ఇక సీమా ముస్తాఫా మోస్ట్ పాపులర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. గతంలో ప్రింట్ , టెలివిజన్ జర్నలిస్ట్ గా పని చేశారు. ప్రస్తుతం ఆమె డిజిటల్ వార్తా పత్రిక ది సిటిజన్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్నారు.
సీమా ముస్తాఫా 16 అక్టోబర్ 2020 నుండి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె ఉత్తర ప్రదేశ్ కు చెందిన ముస్లిం కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి భారత సైన్యంలో అధికారి. తల్లి స్వాతంత్ర సమర యోధుడి కూతురు. ముస్తాఫాకు ఇద్దరు అన్నలు ఉన్నారు. ఎస్పీ ముస్తాబా హిందూస్తాన్ యూనిలీవర్ గ్రూప్ కోశాధికారిగా ఉన్నారు.
మరొకరు కమల్ ముస్తాఫా సిటీ బ్యాంక్ గ్లోబల్ చీఫ్ గా పని చేశారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. ఇక సీమా ముస్తాఫా ది పయనీర్ తో తన జర్నలిజం కెరీర్ ను స్టార్ట్ చేశారు. 1979లో పేట్రియాట్ కు మారారు. 1997లో ఏషియన్ ఏజ్ లో రాజకీయ సంపాదకుడిగా ఉన్నారు. అంతకు ముందు ది టెలిగ్రాఫ్ , ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో సహా అనేక భారతీయ ప్రచురణలకు పని చేశారు సీమా ముస్తాఫా(Seema Mustafa).
కార్గిల్ కవరేజికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. 1008లో కోవర్ట్ కి రెసిడెంట్ ఎడిటర్ గా పని చేశారు. 2010లో ది సండే గార్డియన్ లో చేరారు. ముస్తాఫా న్యూస్ ఎక్స్ లో చేరారు. టాక్ విత్ సీమా పేరుతో పాపులర్ అయ్యారు. సీఎఫ్ఏకి మారారు. 2014లో డిజిటల్ డైలీని స్థాపించింది.
Also Read : మలాలాకు ప్రియాంక చోప్రా మద్దతు