Selayeru Paruthunte Song : ‘సెలయేరు పారుతుంటే’ సెన్సేషన్
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సాంగ్
Selayeru Paruthunte Song : తెలంగాణ జానపదానికి పెట్టింది పేరు. టెక్నాలజీ పుణ్యమా అని వేలాది మంది కళాకారులకు వేదికగా మారింది సోషల్ మీడియా. ప్రధానంగా గూగుల్ పుణ్యమా అని యూట్యూబ్ ఇప్పుడు వారందరికీ జీవనోపాధిని కల్పిస్తోంది.
అవకాశాల కోసం వేరే వాళ్లను దేబరించాల్సిన పనే లేకుండా పోతోంది ప్రతిభ ఉన్న కళాకారులు, గాయనీ గాయకులు, లిరిక్ రైటర్లు, సాంకేతిక నిపుణులకు. ప్రతిభ ఉండి కాస్తంత కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు పేరుతో పాటు పైసలు వెనకేసుకోవచ్చు.
ప్రపంచంలో ఎలాంటి అద్భుతాలు చేయాల్సిన పని లేదు. ఆకట్టుకునేలా వాస్తవానికి దగ్గరగా ఉండే ఏ వస్తువైనా, లేదా ఏ పాటైనా ఇట్టే జనాల్లోకి చేరి పోతోంది.
అలాంటి వర్దమాన కళాకారులలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వంగూరు డీజే శివ ఒకడు. ఇప్పటికే అతడు తయారు చేసిన పాటలు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన సెలయేళ్లు పారుతుంటే(Selayeru Paruthunte Song) ఓ పిల్ల యెద గూళ్లు ఊగుతుండే అన్న సాంగ్ యువతీ యువకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
చిత్రీకరణ కూడా అద్భుతంగా నేటివిటీకి దగ్గరగా ఉంది. మహేందర్ ముల్కల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. పాట మరింత అందంగా, అద్భుతంగా ఉండేలా తీర్చి దిద్దాడు సంగీత దర్శకుడు కళ్యాణ్ కీస్.
ఇక పాటకు అనుగుణంగా మనస్సు పెట్టి పాడారు డీజే శివ వంగూరు, శ్రీనిధి. తనే నిర్మించాడు వంగూరు శివ. ఈ సెలయేళ్లు పాడుతుంటే అన్న పాటలో డీజే శివ వంగూరు, సాయి శర్వాణి నటించారు.
ప్రస్తుతం విడుదలై కొన్ని నిమిషాల్లోనే వ్యూయర్స్ ను ఆకట్టుకును దూసుకు పోతోంది. మరిన్ని పాటలు రావాలని ఆశిద్దాం.
Also Read : నెట్ ఫ్లిక్స్ కు కోలుకోలేని దెబ్బ