Ramesh Powar : సీనియ‌ర్ మ‌హిళా ప్లేయ‌ర్లు రాణించాలి

భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కోచ్ పొవార్

Ramesh Powar : న్యూజిలాండ్ వేదిక‌గా ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జ‌ట్లు టాప్ లో ఉన్నాయి. ఇక భార‌త మ‌హిళా జ‌ట్టు పాకిస్తాన్ పై గెలుపొంది కీవీస్ తో ఓడి పోయింది.

ఈ త‌రుణంలో సీనియ‌ర్ మ‌హిళా క్రికెట‌ర్లు పూర్తి స్థాయిలో త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు జ‌ట్టు కోచ్ ర‌మేష్ పొవార్(Ramesh Powar). బాధ్యాత‌యుతంగా ఆడితేనే ఈ ప్ర‌పంచ క‌ప్ లో నిల‌వ‌గ‌ల‌మ‌ని స్ప‌ష్టం చేశాడు.

లేక పోతే మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్నాడు. ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేయాల‌ని సూచించాడు. భార‌త టాప్ ఆర్డ‌ర్ స‌రిగా ఫోక‌స్ పెట్ట‌లేక పోతున్నార‌ని పేర్కొన్నాడు. బంతులు ఎలా వ‌స్తున్నాయో చూసుకోకుండా ఆడితే ఇలాగే ఉంటుంద‌న్నాడు.

కీవీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో పేల‌వ‌మైన ఆట తీరుతో భార‌త్ ఓట‌మ పాలైంద‌ని తెలిపాడు. 261 ప‌రుగుల ఛేద‌న‌లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ తో పాటు జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్ర‌మే ఆడార‌ని మిగ‌తా ఆట‌గాళ్లు అలా వ‌చ్చి ఇలా వెళ్లి పోయార‌ని ఫైర్ అయ్యాడు.

జ‌ట్టులో గెలవాల‌న్న క‌సి త‌గ్గిన‌ట్లు అనిపిస్తోందంటూ చుర‌క‌లు అంటించాడు. 50 ఓవ‌ర్ల మ్యాచ్ లో ఆ టార్గెట్ ఏమంత పెద్ద‌ది కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

కానీ జ‌ట్టులో స‌మ‌న్వ‌యం ఉన్న‌ప్ప‌టికీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో విఫ‌ల‌మవుతూ ఉన్నార‌ని దీనిని స‌రి చేసు కోవాల‌ని సూచించాడు. లేక పోతే వెనుదిరిగే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు హెడ్ కోచ్ ర‌మేష్ పొవార్.

Also Read : టెస్టు ర్యాంకింగ్స్ లో జ‌డేజా టాప్

Leave A Reply

Your Email Id will not be published!