Rahul Dravid : సీనియర్లకు విశ్రాంతి అవసరం – ద్రవిడ్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ కామెంట్స్
Rahul Dravid : టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈనెల 9 నుంచి సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పటికే కోచ్ ఆధ్వర్యంలో నెట్స్ లో భారత ఆటగాళ్లు భారీగా ప్రాక్టీస్ చేశారు.
కాగా గత కొంత కాలంగా ఆ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్ల పర్ ఫార్మెన్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆట తీరు అంత బాగుండడం లేదు.
ఐపీఎల్ లో రోహిత్, కోహ్లీ దారుణమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక కేఎల్ రాహుల్ పర్వాలేదని అనిపించాడు. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో సత్తా చాటాల్సిన అవసరంతా. వీరంతా ఇప్పటికే చాలా అనుభవం గడించిన ఆటగాళ్లు.
కానీ కీలక సమయాల్లో మాత్రం ఆడకుండా చేతులెత్తేస్తున్నారు. దీంతో వారి ఆట తీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు ద్రవిడ్.
అరుణ్ జైట్లీ స్టేడియం లో నెట్స్ ప్రాక్టీస్ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) మీడియాతో మాట్లాడాడు. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్ల ఉన్నారని కితాబు ఇచ్చాడు.
రోహిత్, కోహ్లీ, రాహుల్ దూకుడుగా ఆడలేక పోవడంతో మిడిల్ ఆర్డర్ , చివర్లో వచ్చే ఆటగాళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీనిపై స్పందించాడు ద్రవిడ్. ఇది వాస్తవమే అయినప్పటికీ మ్యాచ్ తీరును బట్టి ఆడాల్సి ఉంటుందన్నాడు.
ఎక్కువగా ఆడడం వల్ల కొంత విశ్రాంతి అవసరమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. మొత్తంగా ఒకవేళ గనుక ఆడక పోతే పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించాడు ద్రవిడ్.
Also Read : ఊహల్లో కాదు వాస్తవంగా ఆడాలి – ద్రవిడ్