Tirumala Incident : తిరుమల తొక్కిసలాట ఘటనలో సంచలన విషయాలు
కాగా ఒక మహిళను కాపాడే ఘటనలో ఆరుగురు బలయ్యారు...
Tirumala : తొక్కీసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇంచార్జుగా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్టు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 8:20 నిమిషాల ప్రాంతంలో క్యూలైన్‌లో ఉన్న ఒక వృద్ద మహిళ శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆమెను బయటకు రప్పించే క్రమంలో అక్కడున్న భద్రత సిబ్బంది గేటు తెరుస్తుండంగా క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగి తోసుకుంటూ వచ్చారని, దీంతో ఊహించని ప్రమాదం జరిగిందని.. ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తహసీల్దార్ జయరామయ్య పిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఒక మహిళను కాపాడే ఘటనలో ఆరుగురు బలయ్యారు. పలువురు గాయపడ్డారు.
Tirumala Incident Updates
కాగా తిరుపతి(Tirupati)లో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా… బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమల(Tirupati)లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుపతి(Tirupati)లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే… బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. మరీ ముఖ్యంగా… బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డరు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.
‘తిరుమల’చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ… తొలిసారిగా, ఆ దశ దాటి భక్తుల మరణాలూ సంభవించాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండగా… తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు… తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో… పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో… బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవిలలాడారు. ఈ విషాదంలో ఆరుగురు మరణించగా… వారిలో ఐదుగురు మహిళలే. తొక్కిసలాటలో పెద్దసంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడటం వంటి ఘటనలు జరిగినప్పటికీ… మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.
Also Read : KV Rao : ఈడీ విచారణలో వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాకినాడ పోర్ట్ ఓనర్