Shah Rukh Khan : నయన్ దంపతులకు బాద్ షా గ్రీటింగ్స్
అభినందించిన రజనీకాంత్..డైరెక్టర్ అట్లీ
Shah Rukh Khan : ప్రముఖ నటీ నటులు నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని నెల రోజులు పూర్తయింది. హానీమూన్ కూడా పూర్తి చేసుకున్న ఈ జట్టు తమిళనాడులోని చెన్నైలో పెద్ద ఎత్తున ఇంటి కోసం కోట్లు ఖర్చు చేశారు.
కేవలం ఇంటీరియర్ కోసమే భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా విదేశాల నుంచి వచ్చిన నయన్ , శివన్ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు దిగ్గజ నటులు బాద్ షా షారూఖ్ ఖాన్ , తలైవా రజనీకాంత్, దర్శకులు మణిరత్నం, అట్లీ.
ఇదిలా ఉండగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విఘ్నేష్ శివన్. ఈ వినయ పూర్వకమైన , దయ గలిగిన , మనోహరమైన , అద్భుతమైన వ్యక్తులు మాతో ఉండడం, ఆశీర్వదించడం, అభినందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
పెళ్లి చేసుకుని నెల రోజులు పూర్తయిన సందర్భంగా నయన తార, శివన్ లు ప్రత్యేకంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ప్రత్యేకంగా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నయన తారను అభినందించారు. ప్రత్యేకంగా గ్రీటింగ్స్ కూడా తెలిపారు. వీరితో పాటు రజనీకాంత్ , మణిరత్నం, అట్లీ, తదితర సినీ ప్రముఖులు నయన తార, శివన్ లకు గ్రీటింగ్స్ తెలిపారు.
ప్రేమ కలిగిన తలైవర్ మాతోనే ఉన్నాడు. మాకు పెద్ద దిక్కుగా ఉన్న మణిరత్నం సర్ కూడా కలిసి పోవడం సంతోషంగా ఉంది. ఇంకొకరిని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంది.
అతనే పూర్తి ఎనర్జిటిక్ గా ఉండే అట్లీ కూడా రావడం ఇంకా ఆనందాన్ని పెంచిందన్నారు నయన్ , విఘ్నేష్ శివన్.
Also Read : ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ అదుర్స్