Shahid Afridi BCCI : బీసీసీఐ ముందు ఐసీసీ బలాదూర్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిది
Shahid Afridi BCCI : ఆసియా కప్ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఆతిథ్యం ఇవ్వాల్సిన పాకిస్తాన్ భారత్ కచ్చితంగా పాల్గొనాలని కోరుతోంది. ఇదే సమయంలో ఈ ఏడాది 2023లో భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉంది. భద్రతా కారణాల రీత్యా దాయాది పాకిస్తాన్ తో తాము ఆడే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ , కార్యదర్శి జే షాతో ప్రకటించారు.
జే షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు చైర్మన్ గా ఉన్నాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా నియమితులైన నిజామ్ సేథీ నానా తంటాలు పడుతున్నాడు. జే షాతో దుబాయ్ లో జరిగిన కీలక మీటింగ్ లో అరిచినంత పని చేశాడు.
ఆసియా కప్ లో భారత్ ఆడక పోతే పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్ కప్ లో ఆడ బోదంటూ పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రజా ప్రకటించాడు. ప్రస్తుతం నిజామ్ సేథీ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ మొత్తం వ్యవహారంపై ఐసీసీ దాకా వెళ్లింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిదీ(Shahid Afridi BCCI) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ ప్రపంచ క్రికెట్ లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలకంగా మారిందని పేర్కొన్నాడు.
బీసీసీఐ ముందు ఐసీసీ ఏమీ చేయదన్నాడు. దాని ముందు ఇది బలాదూర్ అంటూ ఎద్దేవా చేశాడు. మొత్తంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంతగా వాదించినా ప్రయోజనం లేదని పేర్కొన్నాడు.
Also Read : పాక్ చేతిలో ఐర్లాండ్ ఓటమి