Sharad Pawar: హెం మంత్రి అమిత్ షా పై శరద్‌ పవార్‌ ఘాటు వ్యాఖ్యలు !

హెం మంత్రి అమిత్ షా పై శరద్‌ పవార్‌ ఘాటు వ్యాఖ్యలు !

Sharad Pawar: కేంద్రమంత్రి అమిత్‌ షా, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడంటూ అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై శరద్‌ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో ఓ కేసు వ్యవహారంలో అమిత్‌ షాను సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు బహిష్కరించిందని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Sharad Pawar Comment

‘‘ఇటీవల అమిత్‌ షా నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ నేనొక ముఠా నాయకుడినంటూ అసత్యాలు పలికారు. అయితే… చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆయనను రెండేళ్ల పాటు గుజరాత్‌ నుంచి బహిష్కరించింది. అలాంటి వ్యక్తి నేడు మన దేశానికి హోంమంత్రిగా కొనసాగడం నిజంగా విచిత్రంగా ఉంది. కాబట్టి, మన దేశం ఎలాంటివారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలి. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తానడంలో సందేహం లేదు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది’’ అంటూ శరద్‌ పవార్‌(Sharad Pawar) తీవ్ర ఆరోపణలు చేశారు.

2010లో సోహ్రాబుద్ధీన్‌ షేక్‌ ఎన్‌ కౌంటర్‌ కేసులో అమిత్‌ షాను సుప్రీంకోర్టు గుజరాత్‌ నుంచి రెండేళ్ల పాటు బహిష్కరించింది. ఆ తర్వాత 2014లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. తనపై షా చేసిన వ్యాఖ్యలకు స్పందించిన శరద్‌ పవార్‌.. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కాగా.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్ర లోని రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈసారి కూడా అధికారం తమదేనంటూ ఎన్డీఎ కూటమి ధీమా వ్యక్తంచేస్తోంది. ఎలాగైనా సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు ఎంవీఏ (మహా వికాస్‌ అఘాడీ) తీవ్రంగా యత్నిస్తోంది.

Also Read : UNESCO: అస్సాం అహోమ్‌ రాజవంశీకుల సమాధులకు యునెస్కో వారసత్వ హోదా !

Leave A Reply

Your Email Id will not be published!