Shardul Thakur : చుక్క‌లు చూపించిన శార్దూల్ ఠాకూర్

పంజాబ్ ప‌త‌నాన్ని శాసించిన బౌల‌ర్

Shardul Thakur : ఐపీఎల్ రిచ్ టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ . అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటింది. మిచెల్ మార్ష్ 63 ప‌రుగులు చేస్తే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 32 ర‌న్స్ తో రాణించాడు.

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగులు చేసింది. కేవ‌లం త‌క్కువ స్కోర్ కే ప‌రిమితం అయినా పంజాబ్ ఆదిలోనే త‌డ‌బాటుకు గురైంది.

ప్ర‌ధానంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)  మిస్సైల్ లాంటి బంతుల‌తో పంజాబ్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఆ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 142 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.

దీంతో 16 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్. స్టార్ ఓపెన‌ర్ గా పేరొందిన వెట‌ర‌న్ క్రికెట‌ర్ ధావ‌న్ 19 ప‌రుగులకే వెనుదిరిగాడు.

కీల‌క స‌మ‌యంలో ఆడాల్సిన భానుక రాజ‌ప‌క్స 4 ర‌న్స్ చేస్తే స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన ఇయాన్ లివింగ్ స్టోన్ 3 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇక బాధ్య‌త‌గా ఆడాల్సిన కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ గోల్డెన్ డ‌కౌట్ గా వెనుదిరిగాడు.

ఆదుకుంటాడనుకున్న హ‌ర్ ప్రీత్ బ్రార్ 1 , రిషి ధ‌వ‌న్ 1 ప‌రుగు చేసి క్యూ క‌ట్టారు. ఈ త‌రుణంలో జితేష్ శ‌ర్మ ఒక్క‌డే రాణించాడు. 34 బంతులు ఆడి 44 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

ఆఖ‌రున వ‌చ్చిన రాముల్ చ‌హార్ ద‌25 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. శార్దూల్ ఠాకూర్ 36 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. పంజాబ్ ఓట‌మిని శాసించాడు. దీంతో ఠాకూర్(Shardul Thakur) ను ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.

Also Read : కోహ్లీ..రోహిత్ ఆట తీరుపై గంగూలీ కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!