LIC Shares Sink : క‌నిష్ట స్థాయికి ప‌డి పోయిన ఎల్ఐసీ షేర్లు

రూ. 5 ల‌క్ష‌ల కోట్ల కంటే త‌క్కువ విలువ

LIC Shares Sink : భార‌తీయ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) కు ఊహించ‌ని రీతిలో షాక్ త‌గిలింది. కంపెనీకి సంబంధించిన షేర్ ధ‌ర సోమ‌వారం రికార్డు స్థాయిలో రూ. 782.45కి ప‌డి పోయింది.

కాగా ఎల్ఐసీ(LIC Shares Sink) ఐపీఓ జారీ చేసిన ధ‌ర రూ. 949 నుండి 17.55 శాతం త‌గ్గింది. దీని మొత్తం విలువ రూ. 5 ల‌క్ష‌ల కోట్ల కంటే త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఎల్ఐసీ షేర్ ధ‌ర రూ. 2.01 శాతం త‌గ్గి రూ. 784.15 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అంత‌కు ముందు స్క్రిప్ రూ. 800.25 వంద్ద ఫ్లాట్ గా ప్రారంభ‌మైంది. అమ్మ‌కాల ఒత్తిడిని చూసింది.

ఇంట్రా డేలో త‌క్కువ‌కు ప‌డి పోయింది. ఇదిలా ఉండ‌గా స్టాక్ ఎక్ష్చేంజీల‌లో లిస్టింగ్ అయిన‌ప్ప‌టి నుండి ఇది క‌నిష్ట స్థాయి కి ప‌డి పోవ‌డం ఇదే మొద‌టి సారి. ఎల్ఐసీ షేర్(LIC Shares Sink) వ‌రుస‌గా ఐదో సెష‌న్ లో న‌ష్టాల్లో ట్రేడ్ అవుతోంది.

గ‌త ఐదు సెష‌న్స్ లో స్క్రిప్ దాదాపు 6 శాతం క్షీణించింది. మార్కెట్ లో సాధార‌ణ క్షీణ‌త కంటే ఎల్ఐసీ షేర్ లో క్షీణ‌త ఎక్కువ‌గా ఉంది.

ఈ కాలంలో బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ ఒక శాతం కంటే త‌క్కువ‌గా న‌ష్ట పోయింది ఎల్ఐసీ. లైఫ్ ఇన్సూ రెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ను మొద‌టిసారిగా రూ. 5 ల‌క్ష‌ల కంటే దిగువ‌కు ప‌డి పోయింది.

రూ. 4.98 ల‌క్షల కోట్ల‌కు క్షీణించింది. ఇష్యూ ధ‌ర ఎల్ఐసీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ. 6,00,242 కోట్లు గా ఉంది.

Also Read : భిన్న వ్యాపారాల‌లో అదానీ పెట్టుబ‌డి

Leave A Reply

Your Email Id will not be published!