Shashi Tharoor Hair Style : శ‌శి థ‌రూర్ హెయిర్ స్టైల్ సూప‌ర్

బంగ్లాదేశ్ టీచ‌ర్ ఎంపీకి కితాబు

Shashi Tharoor Hair Style : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష పోటీలో దిగిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని వ‌ర్గాలు, పార్టీల నుంచి ఉంది. ఇవాళ ఎవ‌రు పార్టీ చీఫ్ ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మొత్తంగా విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఎంపిక కానున్న‌ట్లు టాక్.

ఈ త‌రుణంలో బంగ్లాదేశ్ కు చెందిన ఓ టీచ‌ర్ ఎంపీ శ‌శి థ‌రూర్ హెయిర్ స్టైల్(Shashi Tharoor Hair Style) బాగుందంటూ కితాబు ఇచ్చాడు. ఈ విష‌యాన్ని స్వ‌త‌హాగా ఎంపీ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గానే కాకుండా మంచి ర‌చ‌యిత‌. ఆయ‌న విస్తృతంగా చ‌దువుతారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎవ‌రూ వాడ‌ని కొత్త ప‌దాల‌ను ఉప‌యోగిస్తారు.

ప్ర‌తిప‌క్షాల‌ను త‌న వాగ్ధాటితో మెస్మ‌రైజ్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ మ్యాథ్స్ టీచ‌ర్ రాసిన లేఖ‌ను పంచుకున్నారు శ‌శి థ‌రూర్. పార్ల‌మెంటేరియ‌న్ హెయిర్ లైన్ లు క‌చ్చితంగా క్వార్టిక్ ఫంక్ష‌న్ ను పోలి ఉంటాయ‌ని రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. కాగా ఈ లేఖ రాసింది బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాకు చెందిన టీచ‌ర్ జ‌ల‌జ్ చ‌తుర్వేది.

ప్ర‌స్తుతం తిరువ‌నంత‌పురం ఎంపీ చేసిన ట్వీట్ విప‌రీత‌మైన ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. లైక్ లు, షేర్లు, కామెంట్ల‌తో నిండి పోయింది ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతా. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తో పాటు అదే స్థాయిలో శ‌శి థ‌రూర్ కు ఫాలోయింగ్ ఉండ‌డం విశేషం.

Also Read : ర‌చ‌యిత క‌రుణతిల‌క‌కు బూక‌ర్ ప్రైజ్

Leave A Reply

Your Email Id will not be published!