Shashi Tharoor : మ‌హూవా మోయిత్రాకు శ‌శి థ‌రూర్ మ‌ద్ధ‌తు

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పూజిస్తారు

Shashi Tharoor : కాళీ దేవిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిందంటూ పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా. ఇప్ప‌టికే బీజేపీ దీనిని పెద్ద రాద్ధాంతం చేసింది.

ఈ త‌రుణంలో ఆమెపై కేసు కూడా న‌మోదైంది. దీనిని మ‌హూవా మోయిత్రా లైట్ గా తీసుకున్నారు. గూండాయిజం, పోలీసిజం, బ్లాక్ మెయిల్ కు పాల్ప‌డితే ఊరుకోన‌ని హెచ్చ‌రించారు.

భార‌త రాజ్యాంగం ప్ర‌కారం త‌న‌కు ప్ర‌శ్నించే, మాట్లాడే, వ్యాఖ్యానించే, అభిప్రాయాల‌ను తెలిపే హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

కాళీ దేవిపై త‌మ పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మోయిత్రా చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ పార్టీకి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది ఆ కామెంట్స్ కు మాత్ర‌మే చెందిన‌విగా పేర్కొంది.

ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) సీరియ‌స్ గా స్పందించారు. ఆయ‌న టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రాకు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఆమెపై జ‌రుగుతున్న వ్య‌క్తిగ‌త దాడితో తాను ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు తెలిపారు. ప్ర‌తి వ్య‌క్తికి త‌మ‌దైన రీతిలో దేవుడిని, దేవ‌త‌ను పూజించే హ‌క్కు ఉంద‌న్నారు.

అంతే కాదు కాళీ దేవిని మాంసాహారం, మ‌ద్యం సేవించే దేవ‌త‌గా ఊహించుకునే హ‌క్కు కూడా మోయిత్రాకు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆమె మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచే హ‌క్కు వేరెవ్వ‌రికీ లేద‌ని స్ప‌ష్టం చేశారు శ‌శి థ‌రూర్.

మ‌న ఆరాధ‌నా విధానాలు దేశ వ్యాప్తంగా విస్తృతంగా మారుతూ ఉంటాయ‌ని తెలిపారు. ఆమె ఏ మ‌తాన్ని కించ ప‌ర్చ లేద‌ని అర్థ‌మైంద‌ని పేర్కొన్నారు ఎంపీ.

Also Read : కేంద్ర మంత్రి ప‌ద‌వికి ‘నఖ్వీ’ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!