Karuna Gopal : మ‌హిళా సాధికార‌త‌కు ఆమె ద‌ర్ప‌ణం

క‌రుణా గోపాల్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ విమెన్

Karuna Gopal  : ఫ్యూచ‌ర్ సిటీస్ ఎలా ఉండాలో ఆమెను అడిగితే చాలు గంట‌లే కాదు రోజుల త‌ర‌బ‌డి వివ‌రిస్తారు. మెంటార్ గా, ట్రైన‌ర్ గా, ర‌చ‌యిత‌గా, స్పీక‌ర్ గా..ఆంట్ర‌ప్రెన్యూర్ గా, అడ్వ‌యిజ‌ర్ గా , క‌న్స‌ల్టెంట్ గా ఇలా ప్ర‌తి రంగంలో త‌న‌దైన ముద్ర‌ను వేస్తోంది క‌రుణా గోపాల్.

అత్యున్న‌త మేధావిగా, ఉన్న‌త స్థాయి మేనేజ్ మెంట్ స్కిల్స్ క‌లిగిన వ్య‌క్తిగా ఆమెకు పేరుంది. ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఆమె స‌ల‌హాదారుగా ఉంది.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఎంపిక చేసుకున్న ప్ర‌ముఖుల‌లో ద‌క్షిణాది నుంచి ఎంపికైన ఒకే ఒక్క నాయ‌కురాలు క‌రుణా గోపాల్(Karuna Gopal ).

అంతే కాదు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్ గా ఉన్నారు.

బీజేపీ నేష‌న‌ల్ మేనిఫెస్టో స‌బ్ క‌మిటీలో మెంబ‌ర్ కూడా. ఇండియ‌న్ థింక్ ట్యాంక‌ర్స్ లో కూడా స‌భ్యురాలు.

స్పీక‌ర్ గా ఫ్యూచ‌రిస్ట్ గా పేరొందారు. సిఇఓ, ఛైర్మ‌న్, ఫౌండ‌ర్ గా ఉన్నారు ఫౌండేష‌న్ ఫ‌ర్ ఫ్యూచ‌రిస్టిక్ సిటీస్ సంస్థ‌కు.

కొన్నేళ్లుగా ప్ర‌పంచ వ్యాప్తంగా న‌గ‌రాలు ఎలా అభివృద్ధి చెందాలో, ప‌ర్యావ‌ర‌ణం ఎలా కాపాడు కోవాలో తెలియ చేస్తున్నారు.

టెక్నాల‌జీ, ఇన్నోవేష‌న్, భ‌విష్య‌త్ న‌గ‌రాలు ఆమె ముందున్న ల‌క్ష్యం. ఆమె తిరుగ‌ని దేశం లేదు.

క‌రుణా గోపాల్ ప్ర‌పంచం మెచ్చిన అంబాసిడ‌ర్ గా తెలిసిన వారు పేర్కొంటారు. అంటే ఆమెకు ఉన్న స్టేట‌స్ ఏమిటో తెలుసు కోవ‌చ్చు.

అమెరికా, స్వీడ‌న్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్, మ‌లేషియా, యుఏఇ, సింగ‌పూర్, ట‌ర్కీ, శ్రీ‌లంక‌, ఇజ్రాయిల్ ప్ర‌భుత్వాల‌తో స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ గురించి స‌ల‌హాదారుగా ఉన్నారు క‌రుణా గోపాల్.

దుబాయిలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ స‌మ్మిట్ లో ఆమె కీల‌క భూమిక పోషించారు.100 స్మార్ట్ సిటీస్ మిష‌న్ ప్రోగ్రామ్ ను ప్ర‌ధాని మోదీ లాంచ్ చేశారు.

ప్ర‌పంచ బ్యాంకు, డిఎఫ్ఐడీకి అర్బ‌న్ ఎక్స్ ప‌ర్ట్ గా ప‌ని చేశారు.

యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల‌ప్ మెంట్, ఏషియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ కు అడ్వ‌యిజ‌ర్ గా ఉన్నారు.

2015లో జ‌రిగిన యుఎన్ ఎఫ్ సీసీసీ స‌మ్మిట్ లో మెయిన్ స్పీక‌ర్ గా ఉన్నారు క‌రుణా గోపాల్(Karuna Gopal ).

సీటీబీయుహెచ్ కు సిటీ రిప్ర‌జెంటేటివ్ గా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఏడాది అవుతుంది ఆమె చేసిన స‌ర్వీస్ ,

ప‌రిశోధ‌న గురించి. క‌రుణా గోపాల్ వ్య‌క్తి కాదు వ్య‌వ‌స్థ‌. మ‌న హైద‌రాబాద్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్.

ఈ పురుషాధిక్య స‌మాజంలో ఒక మ‌హిళగా ఉంటూ ప్ర‌పంచాన్ని శాసించే దేశాల‌కు ఆమె స‌ల‌హాదారుగా ఉండ‌డం మ‌హిళా సాధికార‌త‌కు

ద‌ర్ప‌ణం కాదంటారా. లెక్క‌లేన‌న్ని పుర‌స్కారాలు, అవార్డులు, ప్ర‌శంస‌లు క‌రుణా గోపాల్ అందుకున్నారు.

Also Read : మ‌హిళ‌ల కోసం ప్ర‌తి ఏటా ప్ర‌త్యేకం

Leave A Reply

Your Email Id will not be published!