Sheik Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ‘షేక్ హసీనా’ కు అరెస్ట్ వారెంట్ జారీ

కానీ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది...

Sheik Hasina : బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్త విద్యార్థుల నిరసన తర్వాత ఆగస్టులో అధికారం నుండి తొలగించబడిన మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ తాజుల్‌ ఇస్లాం మాట్లాడుతూ.. మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheik Hasina)ను అరెస్టు చేసి నవంబర్‌ 18లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధాని భారతదేశానికి పారిపోయారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుండి పారిపోయినప్పటి నుండి బహిరంగంగా కనిపించలేదన్నారు. ఆమె ప్రస్తుతం భారత రాజధాని న్యూఢిల్లీకి సమీపంలోని సైనిక వైమానిక స్థావరంలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Sheik Hasina got Arrest Warrent

జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాపై అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. హసీనా 15 ఏళ్ల పాలనలో, ఆమె రాజకీయ ప్రత్యర్థులపై సామూహిక నిర్బంధం, చట్టవిరుద్ధమైన హత్యలతో సహా మానవ హక్కుల ఉల్లంఘనలు విస్తృతంగా చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్‌తో పాటు పేర్లు వెల్లడించని మరో 44 మందిపై కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. హసీనా పదవి నుంచి వైదొలిగిన న తర్వాత డజన్ల కొద్దీ హసీనా మిత్రులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ క్యాబినెట్ మంత్రులు, ఆమె అవామీ లీగ్ పార్టీకి చెందిన ఇతర సీనియర్ సభ్యులను కూడా అరెస్టు చేశారు. ఆమె పాలనలో నియమించిన అధికారులను కూడా తొలగించారు.

Also Read : AP Rains : తీరం దాటిన తుఫాన్..ఆ జిల్లాల్లో ఇంకా వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!